Begin typing your search above and press return to search.

ధమాకా.. అన్ని ప్రశ్నలకు సమాధానం

By:  Tupaki Desk   |   2 Aug 2022 6:32 AM GMT
ధమాకా.. అన్ని ప్రశ్నలకు సమాధానం
X
రవితేజ వరు ఫ్లాప్ లకు క్రాక్ తో బ్రేక్‌ పడింది.. ఇక వరుసగా మాస్ బ్లాక్ బస్టర్స్ ఖాయం అనుకుంటున్న సమయంలో అనూహ్యంగా ఖిలాడీ మరియు రామారావు ఆన్ డ్యూటీ సినిమాలు నిరాశ పర్చాయి. రవితేజ కెరీర్‌ సందిగ్దంలో పడ్డట్లు అయ్యిందంటూ సినీ విశ్లేషకులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. ఇలాంటి ప్లాప్ లు రవితేజ చాలానే చూశాడు కాని ఇప్పుడు పరిస్థితి వేరు అనేది కొందరి వాదన.

క్రాక్‌ హిట్‌ తో రవితేజ ఒకే సారి అరడజను సినిమాలకు సైన్ చేశాడు. అందులో ఇంకా ధమాకా.. టైగర్ నాగేశ్వరరావు మరియు రాక్షసుడు సినిమాలు ఉన్నాయి. ఈ సినిమాలు షూటింగ్‌ దశలో ఉండగా మరి కొన్ని చర్చల దశలో ఉన్నాయి. ఇప్పుడు అందరి దృష్టి కూడా ధమాకా పై ఉంది. అన్ని అనుకున్నట్లుగా జరిగితే ధమాకా ఇదే ఏడాది ప్రేక్షకుల ముందుకు వచ్చే అవకాశాలు ఉన్నాయి.

రవితేజ వరుస ఫ్లాప్స్ కు ధమాకా సినిమా బ్రేక్‌ వేస్తుందా.. లేదంటే మరో ఫ్లాప్‌ గా నిలిచి రవితేజ కు ఫ్లాప్‌ ల హ్యాట్రిక్ అవుతుందా అనేది ఆసక్తికరంగా మారింది. ధమాకా సినిమాకు త్రినాధరావు నక్కిన దర్శకత్వం వహిస్తున్నారు.

ఈయన మాస్ సినిమాలకు పెట్టింది పేరు.. ఈయన గత సినిమాల ఫలితాన్ని బట్టి చూస్తూ ఉంటే రవితేజకు ఒక మంచి మాస్ బ్లాక్‌ బస్టర్‌ ఇచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి.

తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం ఇప్పటి వరకు చేసిన సన్నివేశాలకు సంబంధించిన ఔట్‌ పుట్ విషయంలో చాలా సంతృప్తిగా ఉన్నారట. రవితేజ మార్క్ మాస్ ఎలిమెంట్స్ మరియు కామెడీ ఈ సినిమాలో పుష్కలంగా ఉంటుందని.. సినిమా తప్పకుండా రవితేజకు హిట్ అందిస్తుందనే నమ్మకంను యూనిట్‌ సభ్యులు వ్యక్తం చేస్తున్నారు.

రామారావు ఆన్ డ్యూటీ సినిమా ఆశించిన స్థాయిలో మెప్పించని కారణంగా రవితేజ తన ధమాకా సినిమాను స్పీడ్‌ గా పూర్తి చేసి సాధ్యం అయినంత త్వరగా విడుదల చేసేందుకు ప్రయత్నించే అవకాశాలు ఉన్నాయి. తద్వారా రవితేజ ఫ్యాన్స్ లో ఉన్న ప్రశ్నలన్నింటికి కూడా సమాధానాలు లభించే అవకాశాలు ఉన్నాయి.