Begin typing your search above and press return to search.
చరణ్ - అనిల్ రావిపూడి కాంబోలో సినిమా రాబోతోందా...?
By: Tupaki Desk | 17 April 2020 11:20 AM ISTమెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ప్రస్తుతం 'ఆర్.ఆర్.ఆర్' చిత్రంలో నటిస్తున్నాడు. పాన్ ఇండియా మూవీగా తెరకెక్కుతున్న ఈ చిత్రంలో రామ్ చరణ్ 'మన్నెం దొర అల్లూరి సీతారామరాజు' పాత్రలో నటిస్తున్న విషయం తెలిసిందే. ఈ సినిమా తర్వాత తన హోమ్ ప్రొడక్షన్ లో తెరకెక్కుతున్న 'ఆచార్య' మూవీలో ఓ కీలక పాత్ర చేయనున్నాడు. అందరు హీరోలు ఒక దాని మీద ఒకటి ప్రాజెక్ట్స్ ఓకే చేస్తున్న తరుణంలో చరణ్ నెక్స్ట్ ఏ చిత్రం చేయబోతున్నాడని ఫ్యాన్స్ ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఈ నేపథ్యంలో రామ్ చరణ్ తన నెక్స్ట్ ప్రాజెక్ట్ డైరెక్టర్ అనిల్ రావిపూడితో చేయబోతున్నాడనే న్యూస్ బయటకి వచ్చింది. 'ఆర్.ఆర్.ఆర్' చిత్రాన్ని భారీ బడ్జెట్ తో తెరకెక్కిస్తున్న డీవీవీ దానయ్య ఈ చిత్రాన్ని కూడా నిర్మించబోతున్నారట. వీరి కలయికలో ఇంతకముందు 'వినయ విధేయ రామ' వచ్చిన విషయం తెలిసిందే. ఇప్పటికే వీరి మధ్య కొత్త ప్రాజెక్ట్ గురించి డిస్కషన్ జరిగిందని.. ఆల్ మోస్ట్ కన్ఫామ్ అయినట్లేనని ఇండస్ట్రీ వర్గాల సమాచారం.
అనిల్ రావిపూడి ఈ ఏడాది ప్రారంభంలో సూపర్ స్టార్ మహేష్ బాబుతో 'సరిలేరు నీకెవ్వరూ'లాంటి బ్లాక్ బస్టర్ సినిమా అందించాడు. దీని తర్వాత తన తదుపరి సినిమా 'ఎఫ్ 3' స్ర్రిప్ట్ ని రెడీ చేస్తున్నాడు అనిల్. దీంతో ఇంతకీ 'ఎఫ్ 3'లో రామ్ చరణ్ ఏమైనా నటిస్తున్నాడా.. లేక చెర్రీ కోసం అనిల్ రావిపూడి సెపరేట్ గా కథ సిద్ధం చేస్తున్నాడా.. అనే అనుమానం ఇప్పుడు సినీ ఇండస్ట్రీలోని పలువురు వ్యక్తం చేస్తున్నారు. అయితే రామ్ చరణ్ ఆల్రెడీ మల్టీస్టారర్ 'ఆర్.ఆర్.ఆర్' సినిమాలో ఎన్టీఆర్ తో కలిసి నటిస్తున్నాడు. ఆ తర్వాత ఆచార్య లో చిరు పక్కన నిలబడనున్నాడు. ఈ నేపథ్యంలో రామ్ చరణ్ సోలో సినిమా చేయడానికి ప్లాన్ చేస్తున్నాడని సమాచారం. దీన్ని బట్టి చూస్తే మల్టీస్టారర్ 'ఎఫ్ 3'లో చరణ్ నటించే అవకాశం లేదని చెప్పవచ్చు.
'ఆర్ ఆర్ ఆర్'లాంటి పాన్ ఇండియా మూవీలో యాక్ట్ చేసిన చెర్రీ తో నెక్స్ట్ ప్రాజెక్ట్ అంటే అనిల్ రావిపూడి గోల్డెన్ ఛాన్స్ కొట్టేసినట్టే అని చెప్పవచ్చు. కానీ మరోవైపు ఎఫ్ 3 కమిట్ అయ్యున్నాడు అనిల్. మరి ఈ నేపథ్యంలో 'ఎఫ్ 3' కోసం మెగా ఆఫర్ వదులుకుంటాడా అనే డౌట్ రాకమానదు. ఏవిధంగా చూసుకున్న మిస్ చేసుకోకపోవచ్చనే చెప్పవచ్చు. ఒకవేళ మిస్ చేసుకుంటే మాత్రం చెర్రీ మాత్రం మరో ఛాన్స్ ఇచ్చే టైపు కాదు. ఒకవేళ చెర్రీతో ముందుకెళ్లినా అనిల్ రావిపూడిని ఒక సెంటిమెంట్ ఇబ్బంది పెట్టే ఛాన్సెస్ ఉన్నాయి. ఏంటంటే చెర్రీతో కామెడీ కమర్షియల్ డైరెక్టర్లు ఎవరైనా సినిమాలు తీస్తే ఆ తరవాత నుంచి ఆ దర్శకుడికి సరైన అవకాశాలు రావనే సెంటిమెంట్ ఇండస్ట్రీలో ఉంది. మరి ఈ బ్యాడ్ సెంటిమెంట్ ను అనిల్ రావిపూడి బ్రేక్ చేస్తాడా.. లేక అసలు చెర్రీతో సినిమానే వదలుకుంటాడా అనేది ముందు రోజుల్లో తెలియనుంది.