Begin typing your search above and press return to search.

దిల్‌ రాజు మాట నెగ్గించుకున్నాడుగా..!

By:  Tupaki Desk   |   30 Jan 2020 7:40 AM GMT
దిల్‌ రాజు మాట నెగ్గించుకున్నాడుగా..!
X
సినిమాల జడ్జ్‌ మెంట్‌ విషయం లో టాలీవుడ్‌ లో దిల్‌ రాజు తర్వాతే మరెవ్వరైనా అంటూ చాలా మంది అంటూ ఉంటారు. ఎలాంటి కథలకు ఎవరు నప్పుతారు.. ఎలాంటి పాత్రలకు ఎవరిని తీసుకుంటే బాగుంటుందనే విషయం కూడా ఆయన బాగా జడ్జ్‌ మెంట్‌ చేస్తాడని ప్రతి ఒక్కరు అనుకుంటారు. అలాగే సినిమా మార్కెట్‌ ను దృష్టిలో పెట్టుకుని ఆయన బడ్జెట్‌ పెట్టడం.. హీరో మరియు దర్శకుడి స్థాయిని బట్టి బడ్జెట్‌ ను కేటాయించడం వంటివి చేస్తాడు. అందుకే ఎఫ్‌ 3 విషయం లో ఆయన నిర్ణయాన్ని గౌరవించాలని దర్శకుడు అనీల్‌ రావిపూడి సరెండర్‌ అయ్యాడంటూ సినీ వర్గాల్లో టాక్‌ వినిపిస్తుంది.

ఎఫ్‌ 2 చిత్రం విడుదలైన కొన్ని రోజుల నుండే సీక్వెల్‌ గురించి వార్తలు వచ్చాయి. అనీల్‌ రావిపూడి ఒక స్టోరీ లైన్‌ ను ఎఫ్‌ 3 కోసం అనుకోవడం అదే సమయంలో వెంకటేష్‌ వరుణ్‌ తేజ్‌ లతో పాటు రవితేజ ను కూడా ఎఫ్‌ 3 లో భాగస్వామ్యం చేయాలని అనీల్‌ రావిపూడి భావించాడు. అందుకు సంబంధించిన చర్చలు కూడా జరిపాడంటూ అప్పట్లో వార్తలు వచ్చాయి. సరిలేరు నీకెవ్వరు చిత్రం తర్వాత అనీల్‌ రావిపూడి ప్రస్తుతం ఎఫ్‌ 3 పని లో పడ్డాడు. ఈ సమయం లోనే నిర్మాత అయిన దిల్‌ రాజు ఎఫ్‌ 3 లో రవితేజ అక్కర్లేదు అంటూ వచ్చాడట.

అనీల్‌ రావిపూడి మాత్రం రవితేజ ఉండాలని పట్టుబట్టాడట. ప్రస్తుతం రవితేజ మార్కెట్‌ మరియు ఇతరత్ర కారణాల వల్ల ఎఫ్‌ 3 లో ఆయన ఉంటే బిజినెస్‌ సరిగా అవ్వదంటూ అనీల్‌ రావిపూడికి దిల్‌ రాజు వివరంగా చెప్పడంతో సరే అన్నట్లుగా టాక్‌ నడుస్తుంది. ప్రస్తుతం మూడవ హీరో విషయ మై చర్చలు ఆగి పోయాయి. స్క్రిప్ట్‌ పూర్తి అయిన తర్వాత ఆ పాత్రకు ఎవరు అయితే బాగుంటుంది అనే విషయాన్ని ఆలోచించి అప్పుడు ఏ హీరోతో సంప్రదింపులు జరపాలో చూద్దాం అంటూ దిల్‌ రాజు సూచించడంతో అనీల్‌ రావిపూడి స్క్రిప్ట్‌ వర్క్‌ లో బిజీ అయినట్లు గా సమాచారం అందుతోంది.