Begin typing your search above and press return to search.

రాశి ఖన్నా కూడా కోర్టుకు వెళ్తుందా?

By:  Tupaki Desk   |   13 April 2021 5:17 AM GMT
రాశి ఖన్నా కూడా కోర్టుకు వెళ్తుందా?
X
తెలుగులో ఇప్పుడు కోర్ట్ రూమ్ డ్రామాల సీజన్ నడుస్తోంది. ఈ కొత్త సంవత్సరంలో రిలీజైన నాంది,చెక్, జాతి రత్నాలు, వకీల్ సాబ్ ..ఈ సినిమాలు అన్నింటిలోనూ సెకండాఫ్ లో కోర్ట్ రూమ్ సెటప్ ఉంటుంది. చెక్ తప్ప మిగతా మూడు మంచి హిట్ అయ్యాయి. ఇలాంటివి ఇంకో రెండు హిట్టైతే కోర్ట్ రూమ్ ఒకటైనా పెట్టకపోతే సినిమా ఆడదేమో అనే డౌటానుమానానికి వచ్చేసి అదో సెంటిమెంట్ గా మార్చేస్తారు సినిమా జనం. ఇప్పుడు మరో సినిమాలోనూ కోర్ట్ డ్రామా నడవనుంది. గోపీచంద్ హీరో నటిస్తున్న పక్కా కమర్షియల్ సినిమాలోనూ హీరో లాయిర్ గా కనిపిస్తాడని సమాచారం.

హీరో లాయిర్ అయ్యినప్పుడు నేను మాత్రం లాయిర్ ఎందుకు కాకూడదు అనుకుందో ఏమో హీరోయిన్ రాశి ఖన్నా కూడా లాయిర్ గా కనిపించటానికి రెడీ అయ్యింది. కోర్టు సీన్స్ కూడా ఉంటాయేమో. నాందిలో వరలక్ష్మీ శరత్ కుమార్, చెక్ లో రకుల్ ప్రీతి సింగ్ సీరియస్ గా వాదనలు చేస్తే.., జాతిరత్నాలు సినిమాలో హీరోయిన్ ఫారియా అబ్దుల్లా సెకండాఫ్ లో లాయిర్ గా కోర్ట్ రూమ్ లో నవ్వులు పూయించింది. ఇప్పుడా హీరోయిన్స్ సరసన రాశి ఖన్నా కూడా చేరుతోంది. మారుతి ఈ సినిమా డైరక్ట్ చేస్తున్నారు. మారుతి అంటే నవ్వులు విషయంలో మినిమం గ్యారెంటీ.

గతంలోనూ మారుతి దర్శకత్వంలో వచ్చిన ప్రతి రోజు పండుగే సినిమాలో హీరోయిన్ గా నటించిన రాశి ఖన్నా టిక్ టాక్ వీడియోలు చేస్తూ ఉండే టిక్ టాక్ స్టార్ పాత్రలో కనిపించింది. టిక్ టాక్ వీడియోలు చేస్తూ నవ్వించే పాత్రను పోషించి మెప్పించిన రాశి ఖన్నా పక్కా కమర్షియల్ సినిమా లో కూడా పక్కాగా నవ్వించబోతోందని తెలుస్తోంది. ఆ సినిమాలో టిక్ టాక్ స్టార్ గా కనిపించిన రాశి ఖన్నా పక్కా కమర్షియల్ సినిమాలో ఇదిగో ఇలా లాయిర్ గెటప్ లో కనిపించింది. నిజంగానే లాయిర్ పాత్రలో కనిపిస్తుందా లేక సినిమాలో క్యారక్టర్ పరంగా ఏదైనా నవ్వించటానికి ,హీరో లాయిర్ కాబట్టి తనూ కోటు వేసిందా తెలియాల్సి ఉంది.

ఇక మారుతి దర్శకత్వంలో సినిమా అనగానే ఫ్యామిలీ ఆడియన్స్ అంచనాలు ఎక్సెపెక్టేషన్స్ పెట్టుకుంటారు. ఈ సినిమాలో హీరో పాత్ర డబ్బు కోసం ఏదైనా చేస్తూ..ఏ కేసైనా ఒప్పుకునేలా మరీ కమర్షియల్ గా ఉంటుందట. ప్రతి విషయాన్ని కూడా కమర్షియల్ గా చూడటం వల్ల మొదట లాభించినా, ఆ తర్వాత ఓ కేసు విషయంలో కమర్షియల్ గా కాకుండా మానవతా ధృక్పధంతో కేసు తీసుకోవటం..అదే నిజమైన ఆనందం అని తెలుసుకుని మారటం జరుగుతుందని అంటున్నారు. జీఏ2 మరియు యూవీ క్రియేషన్స్ వారు నిర్మిస్తున్న ఈ సినిమా ను అక్టోబర్ లో విడుదల చేస్తామని మేకర్స్ ఇప్పటికే ప్రకటించారు.