Begin typing your search above and press return to search.

ఆ సీక్వెల్ కి రిస్క్ చేస్తారా ?

By:  Tupaki Desk   |   3 July 2019 11:12 AM IST
ఆ సీక్వెల్ కి రిస్క్ చేస్తారా ?
X
యాంగ్రీ మ్యాన్ ట్యాగ్ తో రాజశేఖర్ సెకండ్ ఇన్నింగ్స్ ఆశించిన రీతిలో కొనసాగడం లేదు. రెండేళ్ల క్రితం వచ్చిన గరుడవేగా హిట్ అయినప్పటికీ కమర్షియల్ లెక్కల్లో నిర్మాతలకు పెద్దగా మిగిలింది ఏమి లేదు. సరే కంబ్యాక్ గా ఉపయోగపడింది లెమ్మని ఈసారి ఇంకాస్త రిస్క్ ని పెంచి ఎక్కువ బడ్జెట్ తో తీసిన కల్కి ఫలితం ఆశించిన రీతిలో లేకపోవడం అభిమానులను కలవరపరుస్తోంది.

అసలు స్టార్సే లేని బ్రోచేవారెవరురా కలెక్షన్స్ కల్కి కన్నా చాలా మెరుగ్గా ఉన్న వాస్తవాన్ని విస్మరించికూడదు. తన సినిమా సూపర్ హిట్ అని ఒక్కొక్కరు ఐదేసి సార్లు చూస్తున్నారని రాజశేఖర్ ఎంత చెప్పుకుంటున్నా టికెట్ కౌంటర్ల వద్ద దానికి భిన్నమైన పరిస్థితి ఉంది. బిజినెస్ లెక్కల్లో హక్కుల రూపంలో కల్కి మరీ నష్టాలు కలిగించలేదు కానీ బయ్యర్లు మాత్రం ఎంతో కొంత చేతి చమురు వదిలించుకొక తప్పని పరిస్థితి అయితే కనిపిస్తోంది

ఇప్పుడు రాజశేఖర్ మార్కెట్ మీద క్లారిటీ వచ్చేసింది కాబట్టి గరుడవేగా సీక్వెల్ ని నిజంగానే తెరకెక్కిస్తారా అనే ప్రశ్న ఉత్పన్నమవుతోంది. ఎందుకంటే ఇది మొదటి భాగం కంటే ఎక్కువ బడ్జెట్ తో తీయాలి. దానికన్నా అసాధారణ కథాకథనాలు ఉండాలి. అందులోనూ తెలుగులో సీక్వెల్స్ కు బాగా నెగటీజ్ సెంటిమెంట్ ఉంది.

బాహుబలి తప్ప పెద్దగా ఆడిన సినిమాలు లేవు. అలాంటపుడు రిస్క్ చేసి మరీ గరుడవేగా కొనసాగింపు తీయడం అనేది అంత ఈజీ కాదు. పైగా కల్కి ఎఫెక్ట్ మార్కెట్ మీద పడింది కాబట్టి దీని రేట్లకు అప్పుడు అమ్మకాలు ఆశించడం సాధ్యం కాకపోవచ్చు. ఏ నిర్ణయం తీసుకున్నా రాజశేఖర్ దంపతులదే ఫైనల్. బయటి నిర్మాతలు అంతేసి బడ్జెట్ తో ముందుకురావడం కష్టమే