Begin typing your search above and press return to search.

రాజ‌మౌళి అందుకు అంగీక‌రిస్తాడా?

By:  Tupaki Desk   |   14 Sep 2022 2:30 AM GMT
రాజ‌మౌళి అందుకు అంగీక‌రిస్తాడా?
X
రాజ‌మౌళి.. ఈ పేరు ఇప్పుడు ఇండియ‌న్ సినిమాని శాసిస్తోంది. టాలీవుడ్ మేక‌ర్స్ తో పాటు బాలీవుడ్ వ‌ర్గాలు కూడా ఇప్పుడు జ‌పిస్తున్న ఒకే ఒక్క పేరిది. ఎక్క‌డా భారీ ప్రాజెక్ట్ ప‌ట్టాలెక్కినా.. దాన్ని మార్కెట్ చేయ‌డానికో మ‌రో దానికో రాజ‌మౌళిని రంగంలోకి దించాల‌ని స్టార్ మేక‌ర్స్ సైతం ఆయ‌న వెంట ప‌డుతున్నారు. బాహుబ‌లి, RRR ల‌తో జ‌క్క‌న్న క్రేజ్ హాలీవుడ్ కు చేర‌డంతో అంతా ఆయ‌న జప‌మే చేస్తున్నారు. ఆయ‌న పేరే వ‌ళ్లిస్తున్నారు.

ఆయ‌నే కావాలంటూ వెంట ప‌డుతున్నారు. ఇటీవ‌ల 'బ్రహ్మాస్త్ర‌' కోసం బాలీవుడ్ మేక‌ర్స్ రాజ‌మౌళిని రంగంలోకి దింపిన విష‌యం తెలిసిందే. తాము ముందు వుంటే బాయ్ కాట్ వివాదం ఎక్క‌డ సినిమాని కిల్ చేస్తుందోన‌ని భ‌య‌ప‌డిన క‌ర‌ణ్ జోహార్ .. రాజ‌మౌళిని త‌న సినిమాకు ప్ర‌చారం చేయాల్సిందిగా కోరి తాను అనుకున్న‌ట్టుగానే ప్ర‌చారం చేయించుకున్నాడు. ఇప్ప‌డు మ‌రో క్రేజీ ప్రొడ్యూస‌ర్ క‌న్ను రాజ‌మౌళిపై ప‌డింది. ఆయ‌నే స్టార్ ప్రొడ్యూస‌ర్ అల్లు అర‌వింద్‌.

గ‌తంలో రాజ‌మౌళితో అల్లు అర‌వింద్ 'మ‌గ‌ధీర‌' వంటి బ్లాక్ బ‌స్ట‌ర్ మూవీని ర‌కూపొందించి సంచ‌ల‌న విజ‌యాన్ని సొంతం చేసుకున్న విష‌యం తెలిసిందే. ఈ సినిమా త‌రువాత మ‌ళ్లీ ఈ ఇద్ద‌రు క‌లిసి మ‌రో సినిమా చేయ‌లేదు. అయితే ఇన్నాళ్లుకు అల్లు అర‌వింద్ .. రాజ‌మౌళి స‌హాయం కోర‌డం ఇప్పుడు ఆస‌క్తిక‌రంగా మారింది. అల్లు అర‌వింద్ తాజాగా డిస్నీ ప్ల‌స్ హాట్ స్టార్ కోసం 'మ‌హాభార‌త్‌' పేరుతో కాన్సెప్ట్ ఆర్ట్ ని విడుద‌ల చేసిన విష‌యం తెలిసిందే.

కార్టూన్ ల‌లో మ‌హాభార‌త క‌థ‌ని చెప్పాల‌నే ఉద్దేశ్యంతో డిస్నీ ప్ల‌స్ హాట్ స్టార్ అల్లు అర‌వింద్ ఈ ప్రాజెక్ట్ ని ప్ర‌క‌టించారు. అయితే దీన్ని అర్థ‌వంతంగా సాగే వెబ్ సిరీస్ గా మ‌ల‌చ‌డానికి రాజ‌మౌళి లాంటి అనుభ‌వ‌జ్ఞ‌డైన ద‌ర్శ‌కుడు కావాలి. అలాంటి ద‌ర్శ‌కుడు లేక‌పోతే అల్లు వారి 'మ‌హాభార‌త్‌' ప్ర‌య‌త్నం ఫ‌లించ‌దు. ఇదే విష‌యాన్ని గ్ర‌హించిన అల్లు అర‌వింద్ అత్యంత ప్రతిష్టాత్మ‌కంగా తెర‌కెక్కించ‌నున్న ఈ వెబ్ సిరీస్ కు షో ర‌న్న‌గా, భాగ‌స్వామిగా వ్య‌వ‌హ‌రించ‌డానికి రాజ‌మౌళిని రంగంలోకి దించాల‌నుకుంటున్నార‌ట‌.

త‌ను షోర‌న్న‌ర్ గా వుంటే అల్లు ఎంట‌ర్ టైన్ మెంట్స్ ద్వారా నిర్మించ‌త‌ల‌పెట్టిన ఈ ప్రాజెక్ట్ లో భాగ‌స్వామిగా చేర్చుకుంటాన‌ని అల్లు అర‌వింద్ .. రాజ‌మౌళితో చ‌ర్చ‌లు జ‌రుపుతున్న‌ట్టుగా వార్త‌లు వినిపిస్తున్నాయి. 'మ‌గ‌ధీర' స‌మ‌యంలో ఏర్ప‌డిన మ‌న‌స్ప‌ర్థ‌ల‌ని దృష్టిలో పెట్టుకుని జ‌క్క‌న్న అల్లు వారి డీల్ కు నో అంటాడా? .. లేక త‌న స‌హాయం కోసం ఎదురుచూస్తున్న అల్లు వారికి గ్రీన్ సిగ్న‌ల్ ఇస్తాడా అన్న‌ది వేచి చూడాల్సిందే అని ఇన్ సైడ్ టాక్‌.

నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.