Begin typing your search above and press return to search.
అల డే వన్ రికార్డుల్ని పుష్ప బ్రేక్ చేస్తాడా?
By: Tupaki Desk | 16 Dec 2021 9:00 PM ISTఅల్లు అర్జున్ కెరీర్ బెస్ట్ హిట్ గా నిలిచింది అల వైకుంఠపురములో చిత్రం. ఆ సినిమా చాలా ఏరియాల పాత రికార్డుల్ని బ్రేక్ చేసింది. అయితే ఇప్పుడు ఆ రికార్డుల్ని పుష్ప వేటాడుతాడా? అంటే చెప్పలేని పరిస్థితి. నైజాంలో రికార్డులకు ఆస్కారం ఉన్నా కానీ .. ఏపీలో పరిస్థితి పూర్తి భిన్నంగా ఉంది. డిసెంబర్ 17న `పుష్ప` ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు వస్తోంది.
తెలుగు-తమిళం-హిందీ-మలయాళం-కన్నడలో ఈ చిత్రం విడుదలవుతోంది. అడ్వాన్స్ బుకింగ్ లతో రెండు రాష్ట్రాలు సహా అమెరికాలోనూ బాక్సాఫీస్ వద్ద కలెక్షన్ల మోత మోగుతోంది. అయితే ట్రేడ్ అనాలిసిస్ ప్రకారం.. `అల వైకుంఠపురములో` మొదటి రోజు కలెక్షన్స్ ని పుష్ప- ది రైజ్ అధిగమించకపోవ్చని అంచనా.
అల వైకుంఠపురములో చిత్రం మొదటి రోజు నైజామ్ లో రూ. 4.5 కోట్లు వసూలు చేసింది. పుష్ప అంతకు డబుల్ వసూలు చేస్తుందని అంచనా. చక్కని టికెట్ ధరతో పాటు అదనపు షోలకు అనుమతి లభించడంతో ఊపు కనిపిస్తోంది. పోటీబరిలో ఇంకే ప్రధాన సినిమా లేకపోవడం ప్లస్. అలాగే సీడెడ్ లో అల.. చిత్రం మొదటి రోజు రూ. 3 కోట్లు వసూలు చేసింది. కోస్తా ఆంధ్రలో రూ. 12 కోట్లు వసూలు చేసింది. ఏపీలో టికెట్ ధర కారణంగా పుష్ప భారీ నష్టాన్ని చవి చూడబోతోంది.
హైకోర్టు తీర్పు తర్వాత టిక్కెట్ ధరలను పెంచి విక్రయించవచ్చని చాలామంది భావించినా కానీ ఎగ్జిబిటర్లు జాయింట్ కలెక్టర్ల నుండి సమ్మతి తీసుకున్న తర్వాత మాత్రమే టిక్కెట్ ధరలపై ఏదైనా నిర్ణయం తీసుకోవాలని తీర్పు చెబుతోంది. కాబట్టి మొదటి రోజు అల వైకుంఠపురములో రికార్డును పుష్ప అందుకోవడం కష్టమేనని అంచనా వేస్తున్నారు.
అల చిత్రం కర్ణాటకలో రూ. 1.8 కోట్లు.. కేరళలో 28లక్షలు భారతదేశంలోని ఇతర ప్రాంతాల్లో 1.8 కోట్లు ఆర్జించింది. పుష్పకు చక్కని వసూళ్లు దక్కనున్నాయని అంచనా. అమెరికాలో అల చిత్రం ప్రీమియర్ నుండి 809072 డాలర్లు వసూళ్లు చేసింది. స్పైడర్ మ్యాన్ తో పోటీ కారణంగా పుష్ప కేవలం ఐదు లక్షల డాలర్ల లోపునే ఉందని సమాచారం.
ఏపీలో ధరల ప్రభావంతో పుష్ప రికార్డులకు ఇబ్బంది ఉంది. నైజాం - అమెరికా సహా ఇతర మార్కెట్ల నుంచి ఈ సినిమా భారీ వసూళ్లను సాధించాల్సి ఉంది. అమెరికాలో ఒమిక్రాన్ ప్రభావం ఎలా ఉండనుంది అన్నదానిని బట్టి అక్కడ కలెక్షన్లు ప్రభావితం కానున్నాయి.