Begin typing your search above and press return to search.

ట్రెండీ టాక్‌: పాకెట్ కోసం న‌టించే టైపా ఆయ‌న‌?

By:  Tupaki Desk   |   1 Nov 2020 11:20 AM IST
ట్రెండీ టాక్‌: పాకెట్ కోసం న‌టించే టైపా ఆయ‌న‌?
X
ప‌వ‌ర్ స్టార్ ప‌వ‌న్ క‌ల్యాణ్ వ్య‌క్తిత్వం గురించి తెలిసిన‌వారెవ‌రూ ఆయ‌న‌ను ప్యాకేజీ స్టార్ అనేందుకు సాహ‌సించ‌రు. ఆయ‌నకు కోట్ల‌కు కోట్లు చెల్లించేందుకు కార్పొరెట్ కంపెనీలు సిద్ధంగా ఉన్నా ఏనాడూ వాణిజ్య ప్ర‌క‌ట‌న‌ల్లో న‌టించేందుకు ప్ర‌జ‌ల్ని మోసం చేసేందుకు సిద్ధం కాలేదు. సాటి స్టార్లు ఓవైపు యాడ్స్ లో న‌టించి కోట్ల‌లో వెన‌కేసుకుంటే ఆ ఆదాయాన్ని తృణ ప్రాయంగా త్య‌జించిన హీరో. దాన‌ధ‌ర్మాల్లోనూ నేనున్నాను అంటూ ముందుకొచ్చే స్టార్ అని ఇటీవ‌ల హైద‌రాబాద్ వ‌ర‌ద‌ల్లో కోటి దాన‌మిచ్చి మ‌రోసారి ప్రూవ్ చేశారు. సౌత్ లో సూప‌ర్ స్టార్ ర‌జ‌నీకాంత్ త‌ర్వాత మ‌ళ్లీ అలాంటి మంచి మ‌న‌సున్న హీరోగా ప‌వ‌న్ క‌ల్యాణ్ కి మంచి ఇమేజ్ ఉంది.

అయితే ఆయన రాజ‌కీయాల‌కు బ్రేక్ ఇచ్చి ఇటీవ‌ల వ‌రుస‌గా సినిమాల‌కు క‌మిట‌వుతూ.. ప్యాకేజీలు అందుకుంటున్నాడ‌న్న ప్ర‌చారం హోరెత్తుతోంది. సంపాద‌న కోసం ప్ర‌తి ఒక్క‌రూ ఏదో ఒక‌టి చేస్తుంటారు. నేను సినిమాలు చేయ‌డానికి కార‌ణం అదే.. అని జ‌న‌సేనాని ఓ సంద‌ర్భంలో చెప్ప‌క‌నే చెప్పారు. ఇక కంబ్యాక్ లో వ‌ర‌స‌గా సినిమాల‌కు సంత‌కాలు చేస్తున్నారు. ప్ర‌స్తుతం పింక్ రీమేక్ వ‌కీల్ సాబ్ ని పూర్తి చేసేందుకు రెడీ అవుతున్నారు.

`అయ్యప్పనుమ్ కోశియుమ్` రీమేక్ ని సాగర్ చంద్ర దర్శకత్వంలో పవన్ చేయ‌నున్నారు. ఈ డిసెంబ‌ర్ లేదా జ‌న‌వ‌రిలోనే మూవీని ప్రారంభించేస్తున్నారు. ఇందులో మ‌రో హీరో క‌న్ఫామ్ కావాల్సి ఉంది. అయితే ఉన్న‌ట్టుండి ప్యాకేజీ అన్న‌మాట‌ తెర‌పైకొచ్చింది. క్రిష్ మూవీ స‌హా ప‌లువురికి క‌మిటైనా ముందే ఈ మూవీ ఎందుకు చేస్తున్నారు? అంటూ రంధ్రాన్వేష‌ణ మొద‌లైంది. 40 రోజుల కాల్షీట్లు కూడా రాసిచ్చేశారంటే ప్యాకేజీ కోస‌మేనా? అంటూ విమ‌ర్శించేస్తున్నారు. ఓవ‌రాల్ గా లాభాల్లో వాటా క‌లుపుకుని 40కోట్లు పైగా పారితోషికం మాట్లాడుకున్నార‌ని గుస‌గుస‌లు వైర‌ల్ చేస్తున్నారు. అయితే ఇదంతా నిజ‌మా? ప్యాకేజీ కోస‌మే ఆయ‌న అంగీక‌రిస్తారా? లేక పోతే స్క్రిప్టులో క్లారిటీ ద‌ర్శ‌కుడిలో ప‌నిత‌నాన్ని న‌మ్మి ఓకే చెబుతారా? అన్న‌దానికి ప‌వ‌న్ స్వ‌యంగా ఆన్సర్ ఇస్తారేమో చూడాలి.