Begin typing your search above and press return to search.

ప‌వ‌న్ కు షాకిస్తున్న ఫ్యాన్స్‌..ట్విట్ట‌ర్ లో ర‌చ్చ ర‌చ్చ‌!

By:  Tupaki Desk   |   9 Dec 2022 4:08 AM GMT
ప‌వ‌న్ కు షాకిస్తున్న ఫ్యాన్స్‌..ట్విట్ట‌ర్ లో ర‌చ్చ ర‌చ్చ‌!
X
గ‌త కొన్ని నెల‌లుగా అంగీక‌రించిన సినిమాల విష‌యంలో ఎటూ తేల్చ‌కుండా స‌స్పెన్స్ మెయింటైన్ చేస్తూ వ‌స్తున్న ప‌వర్ స్టార్ ప‌వ‌న్ క‌ల్యాణ్ ఎట్ట‌కేల‌కు మూడు రోజుల క్రితం 'సాహో' ఫేమ్ సుజీత్ తో భారీ పాన్ ఇండియా ప్రాజెక్ట్ ని ప్ర‌క‌టించిన విష‌యం తెలిసిందే. ముందు త‌మిళ హిట్ ఫిల్మ్ 'తేరీ' రీమేక్ ని సుజీత్ తో ప‌వ‌న్ చేయ‌బోతున్నాడ‌ని, అందుకు సంబంధించిన స్క్రిప్ట్ లో మార్పుల బాధ్య‌త‌ను సుజీత్ కి అప్ప‌గించాడ‌ని ప్ర‌చారం జ‌రిగింది. కానీ ఫ‌స్ట్ లుక్ కాన్సెప్ట్ పోస్ట‌ర్ ని రిలీజ్ చేయ‌డంతో ప‌వ‌న్ - సుజీత్ ల క‌ల‌యిక‌లో రానున్న మూవీ రీమేక్ కాద‌ని క్లారిటీ వ‌చ్చేసింది.

దీంతో ప‌వ‌న్‌ అభిమానులు ఆనందాన్ని వ్య‌క్తం చేశారు. కొత్త క‌థ‌తో సుజీత్ - ప‌వ‌న్ ల సినిమా వుండ‌బోతోంద‌ని, ఇది పాన్ ఇండియా రేంజ్ లో వుంటుంద‌ని హ్యాపీ ఫీల‌య్యారు. అయితే 'తేరీ' రీమేక్ ని చేస్తున్నాడా?.. చేయ‌డం లేదా?.. చేస్తే ప‌వ‌న్ ఎవ‌రితో చేయ‌బోతున్నాడ‌న్న‌ది ఇప్పుడు ఆస‌క్తిక‌రంగా మారింది. అభిమానులు 'తేరీ' రీమేక్ విష‌యంలో అనుమానాలు వ్య‌క్తం చేస్తున్న వేళ రీసెంట్ గా 'పెద్ద ఉత్సాహం రాబోతోంది..వాచౌట్ దిల్ స్పేస్ గైస్‌' అంటూ ద‌ర్శ‌కుడు హ‌రీష్ శంక‌ర్ సోష‌ల్ మీడియా వేదిక‌గా ట్వీట్ చేయ‌డంతో అస‌లు ర‌చ్చ మొద‌లైంది.

'తేరీ' రీమేక్ ని సుజీత్ తో కాకుండా హ‌రీష్ శంక‌ర్ తో ప‌వ‌న్ చేయ‌బోతున్నాడ‌ని స్ప‌ష్టత రావ‌డంతో ఫ్యాన్స్ నెట్టింట ర‌చ్చ చేయ‌డం మొద‌లు పెట్టారు. #WeDontWantTheriRemake అనే హ్యాష్ ట్యాగ్ ని ట్రెండ్ చేస్తున్నారు. హ‌ర‌నీష్‌శంక‌ర్ చేసిన ట్వీట్ లో @PawanKalyan @MythriOfficial @ThisIsDSP @DoP_Bose #AnandSai వంటి వారిని ట్యాగ్ చేయ‌డం.. #BhavadeeyuduBhagatSingh ని మాత్రం అవాయిడ్ చేయ‌డంతో హ‌రీష్ శంక‌ర్ చేసిన ట్వీట్ ఖ‌చ్చితంగా 'తేరి' రీమేక్ గురించే అంటూ ఫ్యాన్స్ మండిప‌డుతున్నారు.

ఎట్టిప‌రిస్థితుల్లోనూ రీమేక్ ని అంగీక‌రించ‌మ‌ని తేల్చి చెబుతున్నారు. 'తేరి' రీమేక్ చేసే బ‌దులు 'భ‌వ‌దీయుడు భ‌గ‌త్ సింగ్‌'ని చేయొచ్చుక‌దా? .. అని కామెంట్ లు చేస్తున్నారు. ఈ విష‌యంలో త్రివిక్ర‌మ్ చొర‌వ తీసుకుని 'తేరి' రీమేక్ ని నిలిపియాల‌ని చెబుతున్నారు. కానీ ఇవ‌న్నీ జ‌రిగేలా క‌నిపించ‌డం లేదు. రీసెంట్ గా ప్ర‌భాస్ ఫ్యాన్స్ త‌న‌ని మారుతితో సినిమా చేయాడానికి వీళ్లేద‌ని ఎంత‌గా రిక్వెస్ట్ చేశారో.. నెట్టింట మారుతిని ఎంతగా ట్రోల్ చేశారో అంద‌రికి తెలిసిందే.

ఫ్యాన్స్ ఈ టైమ్ లో మారుతితో సినిమా రిస్క్ అని వారించినా వారి మాట‌ల‌ని ప్ర‌భాస్ పెద్ద‌గా ప‌ట్టించుకోలేదు. త‌ను అనుకున్న‌ట్టుగాను మారుతితో హార‌ర్ థ్రిల్ల‌ర్ మూవీని సైలెంట్ గా ప‌ట్టాలెక్కించేశాడు. ప‌వ‌న్ కూడా 'తేరి' రీమేక్ ని హ‌రీష్ శంక‌ర్ తో తెర‌పైకి తీసుకురాబోతున్నాడ‌ని, త్వ‌ర‌లోనే దీనికి సంబంధించిన అధికారిక ప్ర‌క‌ట‌న రానుంద‌ని తెలుస్తోంది. మ‌రి ఫ్యాన్స్ రియాక్ష‌న్ ఎలా వుంటుందో.. ఎలా రియాక్ట్ అవుతారో.. నెట్టింట ఏ స్థాయిలో ర‌చ్చ చేస్తారో వేచి చూడాల్సిందే అనే కామెంట్ లు వినిపిస్తున్నాయి.



నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.