Begin typing your search above and press return to search.
పవన్ ఈ షెడ్యూల్ తో అయినా ముగించేస్తాడా?
By: Tupaki Desk | 19 Nov 2022 8:00 AM ISTపవర్ స్టార్ పవన్ కల్యాణ్ గత కొన్ని నెలలుగా రెండు పడవల ప్రయాణం చేస్తున్నారు. టైమ్ చిక్కినప్పుడు సినిమా సెట్లో ప్రత్యక్షమవుతున్నాడు. పొలిటికల్ టైమ్ దొరగ్గానే జనసేన పార్టీ కార్యకలాపాల్లో భాగంగా ఏపీలె పర్యటిస్తూ జగన్ ప్రభుత్వంపై, మంత్రులపై విరుచుకు పడుతున్నారు. తనదైన వ్యాఖ్యలతో రాష్ట్రంలో రాజకీయ ప్రకంపణలు సృష్టిస్తున్నారు. దీని వల్ల తను అంగీకరించిన సినిమాల షూటింగ్ లు నిరవధికంగా వాయిదా పడుతూ వస్తున్నాయి.
పవన్ కల్యాణ్ తాజా పరిస్థితి కారణంగా క్రిష్ జాగర్లమూడితో స్టార్ ప్రొడ్యూసర్ ఏ.ఎం. రత్నం నిర్మిస్తున్న పీరియాడిక్ మూవీ `హరి హర వీరమల్లు` షూటింగ్ ఆలస్యం అవుతూ వస్తోంది. 17వ శతాబ్దం నేపథ్యంలో మొఘల్ సామ్రాజ్య కాలం నాటి కథతో ఈ మూవీని రూపొందిస్తున్నారు. కోవిడ్ కి ముందు మొదలైన ఈ మూవీ రెగ్యులర్ షూటింగ్ గత కొన్ని నెలలుగా ఆగుతూ సాగుతూ వస్తోంది. పవన్ కల్యాణ్ తన కెరీర్ లో నటిస్తున్న తొలి పీరియాడిక్, పాన్ ఇండియా మూవీ ఇది.
దీంతో ఫ్యాన్స్ ఈ మూవీపై భారీ అంచనాలు పెట్టుకున్నారు. అందరు హీరోల తరహాలోనే పవన్ కూడా పాన్ ఇండియా మూవీ చేస్తుండటంతో దీని రేంజ్ భారీ స్థాయిలో వుంటుందని ఫ్యాన్స్ భావించారు. కానీ రియాలిటీ కొస్తే సినిమా షూటింగ్ పరిస్థితి మరోలా వుంది. పవన్ ఎప్పడు గ్రీన్ సిగ్నల్ ఇచ్చి సెట్లోకి వస్తే అప్పుడే షూటింగ్ చేస్తూ వెళుతున్నారు. దీంతో ఈ మూవీ షూటింగ్ ఆలస్యం అవుతూ వస్తోంది.
రీసెంట్ గా వైజాగ్ పార్టీ వ్యవహారాల్లో భాగంగా వెళ్లిన పవన్ కల్యాణ్ తిరికి వచ్చిన వెంటనే రామోజీ ఫిల్మ్ సిటీలో తాజా షెడ్యూల్ ని మొదలు పెట్టారు. ఆ తరువాత ప్రధాని వస్తున్నారనగానే షూటింగ్ కి మళ్లీ బ్రేకిచ్చి పవన్ ఏపీ వెళ్లారు. తాజాగా తిరిగి హైదరాబాద్ వచ్చిన పవన్ రామోజీ ఫిల్మ్ సిటీలో జరుగుతున్న కీలక షెడ్యూల్ లో పాల్గొంటున్నారట. పవన్ పాల్గొనగా దర్శకుడు క్రిష్ భారీ యాక్షన్ ఎపిసోడ్ కు ప్లాన్ చేశాడట.
ఇంటర్వెల్ బ్యాంగ్ కి ముందు వచ్చే కీలక ఘట్టం ఇదని తెలుస్తోంది. సినిమా కథకు కూడా ఇది చాలా ముఖ్యమైన ఘట్టమని తెలుస్తోంది. ముందు అనుకున్న ప్లాన్ ప్రకారం ఈ మూవీ షూటింగ్ ని డిసెంబర్ వరకు కంప్లీట్ చేయాలనుకున్నారట. అయితే షెడ్యూల్ మారడంతో ఈ మూవీ షూటింగ్ జనవరి లేదా ఫిబ్రవరి వరకు పూర్తి కావచ్చని తెలుస్తోంది. అయితే అప్పటికైనా పవన్ పూర్తి చేస్తాడా? లేక మళ్లీ ఎక్స్ టెన్షన్ చేస్తాడా? అనే కామెంట్ లు వినిపిస్తున్నాయి.
నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.