Begin typing your search above and press return to search.

ద‌ర్శ‌కుల ప‌నిలో ప‌వ‌న్ వేలు పెడతారా? క్రియేటివ్ ఫ్రీడ‌మ్ ఇవ్వ‌రా?

By:  Tupaki Desk   |   1 April 2021 9:00 AM IST
ద‌ర్శ‌కుల ప‌నిలో ప‌వ‌న్ వేలు పెడతారా? క్రియేటివ్ ఫ్రీడ‌మ్ ఇవ్వ‌రా?
X
ఫ‌లానా హీరోకి క‌థ చెబితే త‌ర్వాత‌ స్టోరీ మార్చేశాడ‌ని లేదా ప్ర‌తి సీన్ లో వేలు పెట్టి నానా ర‌చ్చ చేశార‌ని ర‌క‌ర‌కాల కామెంట్లు వినిపిస్తుంటాయి. ద‌ర్శ‌కుడికి స్వేచ్ఛ‌నివ్వ‌క‌పోతే ఆ త‌ర్వాత అలాంటి సినిమాలు డిజాస్ట‌ర్లు అయ్యి నిర్మాత‌కు తీర‌ని న‌ష్టాల్ని మిగిల్చాయి. ప‌వ‌న్ క‌ల్యాణ్ ఫింగ‌రింగ్ అంటూ ర‌క‌ర‌కాల గుస‌గుస‌లు గ‌తంలో వినిపించాయి.

కానీ వ‌కీల్ సాబ్ విష‌యంలో వేణు శ్రీ‌రామ్ కి ప‌వ‌న్ ఎంత స్వేచ్ఛ‌నిచ్చారో ఆయ‌న మాట‌ల్లో వింటే ఆశ్చ‌ర్యం క‌ల‌గ‌క మాన‌దు. పింక్ రీమేక్ మొద‌లు పెడుతున్నాం అనుకోగానే.. పవన్ గారిని కలిశాను. అస‌లు పింక్ రీమేక్ సినిమాను ఎలా చేయాల‌నుకుంటున్నారు? అని ప్ర‌శ్నించారు. మీ ఆలోచనలు ఏంటి అని అడిగారు. ఈ కథను మీరు ఎలా తెరకెక్కించాలని ఆలోచిస్తున్నారు అనేది అడిగి మ‌రీ తెలుసుకున్నారు.

ఆయ‌న‌తో రెండు మూడు మీటింగుల్లోనే చాలా స్ప‌ష్ట‌త వ‌చ్చింది. వకీల్ సాబ్ కథ.. క‌థ‌నం.. పాత్ర చిత్ర‌ణ ఎలా ఉంటాయో ఆయ‌న‌కు వివ‌రించాను. త‌ను కూడా కొన్ని ఇన్ ఫుట్స్ ఇచ్చారు. ఆ రెండిటినీ భేరీజు వేసుకుని ముందుకు వెళ్లాం. క‌ళ్యాణ్ గారికి ఉన్న ఏబీసీ కేట‌గిరీ అభిమానుల్ని దృష్టిలో పెట్టుకుని సినిమాని మ‌లిచాం.. అని తెలిపారు.

నా తొలి చిత్రం వ‌చ్చి ప‌దేళ్ల‌య్యింది. మొదటి సినిమా ఓ మై ఫ్రెండ్ సరిగ్గా ఆడలేదు. ఆరేడేళ్ల గ్యాప్ త‌ర్వాత ఎంసీఏ చిత్రాన్ని చేశాను. స్నేహం నేప‌థ్యంలో కథతో ఓ మై ఫ్రెండ్.. వదిన మరిది కాన్సెప్ట్ తో చేసిన ఎంసీఏ ఈ రెండు సినిమాలు వకీల్ సాబ్ సినిమా చేసేందుకు ఉపయోగపడ్డాయి. జ‌యాప‌జ‌యాల‌తో ప‌ని లేకుండా ఇక్క‌డ ప‌ని చేయ‌డానికే నేను వ‌చ్చాను.. అని వేణు శ్రీ‌రామ్ వెల్ల‌డించారు. వ‌కీల్ సాబ్ ఎలా ఉంటుంది? అన్న‌దానికి వివ‌ర‌ణ ఇస్తూ.. హిందీ పింక్ ఒక‌లా.. త‌మిళ రీమేక్ ఇంకోలా ఉంటాయి. వాట‌న్నిటికీ డిఫ‌రెంట్ గా మా పింక్ ఉంటుంది. కానీ క‌థ‌లో ఆత్మ మార‌దు.. అని తెలిపారు.