Begin typing your search above and press return to search.

'సీటీమార్' కంటే ముందు 'పక్కా కమర్షియల్' వస్తుందేమో..!

By:  Tupaki Desk   |   18 Jun 2021 1:30 AM GMT
సీటీమార్ కంటే ముందు పక్కా కమర్షియల్ వస్తుందేమో..!
X
డైనమిక్ హీరో గోపీచంద్ గత2కొంతకాలంగా సరైన హిట్ కోసం ఎదురుచూస్తున్నాడు. 'యజ్ఞం' 'ఆంధ్రుడు' 'గోలీమార్' 'లక్ష్యం' 'రణం' 'లౌక్యం' వంటి సూపర్ హిట్స్ అందుకున్న గోపీచంద్ కు.. గడిచిన మూడేళ్లలో ఐదు ప్లాపులు వచ్చాయి. ఈ నేపథ్యంలో హిట్ కొట్టడానికి ఈసారి ''సీటీమార్‌'' అనే స్పోర్ట్స్‌ బ్యాక్ డ్రాప్ సినిమాని ఎంచుకున్నాడు. కబడ్డీ నేపథ్యంలో తెరకెక్కుతున్న ఈ చిత్రానికి సంపత్‌ నంది దర్శకత్వం వహిస్తున్నారు. మరోవైపు మారుతి దర్శకత్వంలో ''పక్కా కమర్షియల్'' అనే సినిమా కూడా చేసేస్తున్నాడు గోపీచంద్. అయితే ఇప్పటికే షూటింగ్ కంప్లీట్ చేసుకున్న 'సీటీమార్' సినిమా విడుదలపై క్లారిటీ రావడం లేదు.

నిజానికి 'సీటీమార్' చిత్రాన్ని ఏప్రిల్ 2న విడుదల చేయాలని ప్లాన్ చేసుకున్నారు. అయితే కరోనా కారణంగా వాయిదా పడింది. దీంతో ఇప్పటికే 'ఆరడుగుల బుల్లెట్' సినిమా విడుదలకు నోచుకోక ల్యాబ్ లోనే ఉండిపోతే.. ఇప్పుడు మహమ్మారి వైరస్ కారణంగా 'సీటీమార్' ఎప్పుడు ఎలా రిలీజ్ అవుతుందో తెలియ‌ని ప‌రిస్థితి వచ్చిందని ఫిలిం సర్కిల్స్ లో కామెంట్స్ వినిపిస్తున్నాయి.

మరోవైపు 'పక్కా కమర్షియల్' సినిమా షూటింగ్ దాదాపుగా పూర్తైనట్లు తెలుస్తోంది. త్వరలోనే తిరిగి చిత్రీకరణ ప్రారంభించి మిగతా పెండింగ్ వర్క్ కూడా కంప్లీట్ చేయడానికి మేకర్స్ సన్నాహాలు చేస్తున్నారు. దీనిని బట్టి చూస్తే 'సీటీమార్' కంటే ముందు 'పక్కా కమర్షియల్' సినిమా రిలీజ్ అయ్యే ప‌రిస్థితులు వస్తాయేమో అని కామెంట్స్ వస్తున్నాయి. జులై నుంచి థియేటర్లు తెరుచుకుంటాయని ప్రచారం జరుగుతోంది. మరి త్వరలోనే 'సీటీమార్' విడుదలపై స్పష్టత వస్తుందేమో చూడాలి.