Begin typing your search above and press return to search.

పవన్‌ మాత్రమే కాదు ఆమె కూడా కుమ్మేస్తుందట!

By:  Tupaki Desk   |   4 March 2020 9:30 AM GMT
పవన్‌ మాత్రమే కాదు ఆమె కూడా కుమ్మేస్తుందట!
X
పవన్‌ కళ్యాణ్‌ రీఎంట్రీ మూవీ ‘వకీల్‌ సాబ్‌’ షూటింగ్‌ జెట్‌ స్పీడ్‌ గా జరుగుతుందట. మరో రెండు మూడు వారాల్లో షూటింగ్‌ ను పూర్తి చేసే అవకాశాలు ఉన్నాయంటూ సినీ వర్గాల ద్వారా సమాచారం అందుతోంది. గత కొన్ని రోజులుగా కోర్టుకు సంబంధించిన సీన్స్‌ చిత్రీకరణ జరుపుతున్నారు. కోర్టు సీన్‌ లో పవన్‌ కళ్యాణ్‌ నట విశ్వరూపం చూపిస్తున్నాడట అంటూ మీడియాలో వార్తలు వచ్చాయి. తాజాగా మరో ఆసక్తికర విషయం ఒకటి చిత్ర యూనిట్‌ సభ్యుల ద్వారా తెలుస్తోంది.

పవన్‌ కళ్యాణ్‌ తో పాటు ఈ సినిమా లో ముఖ్య పాత్రలో నటిస్తున్న నివేదా థామస్‌ కూడా కోర్టు సీన్‌ లో అద్బుతమైన నటన కబనర్చుతున్నట్లుగా యూనిట్‌ సభ్యులు చెబుతున్నారు. చాలా విభిన్నంగా నివేదా థామస్‌ పాత్ర ఉంటుంది.. ఆ పాత్రకు పూర్తిగా న్యాయం చేసే విధంగా నివేదా చేస్తున్న నటన ఆమె కెరీర్‌ బెస్ట్‌ గా నిలుస్తుందని అంటున్నారు. పవన్‌ తో పోటీ పడుతుందా అన్నట్లుగా నివేదా నటిస్తుంది అంటూ యూనిట్‌ సభ్యులు చెబుతున్నారు.

బాలీవుడ్‌ పింక్‌ కు రీమేక్‌ గా రూపొందుతున్న ఈ మెసేజ్‌ ఓరియంటెడ్‌ చిత్రం కోసం పవన్‌ ఫ్యాన్స్‌ మరియు ప్రేక్షకులు కమర్షియల్‌ సినిమా కోసం ఎదురు చూసే దానికంటే ఎక్కువగా ఎదురు చూస్తున్నారు. వేణు శ్రీరామ్‌ దర్శకత్వంలో ఈ సినిమాను దిల్‌ రాజు నిర్మిస్తున్నాడు. బోణీ కపూర్‌ ఈ సినిమాకు సమర్పకుడిగా వ్యవహరిస్తున్నాడు. తాజాగా విడుదలైన ఫస్ట్‌ లుక్‌ తో సినిమాకు ఏ స్థాయి క్రేజ్‌ ఉందో తేలిపోయింది. సినిమా ఖచ్చింగా రికార్డు స్థాయి వసూళ్లను దక్కించుకుంటుందని ఫ్యాన్స్‌ నమ్మకం గా ఉన్నారు.