Begin typing your search above and press return to search.

`బిగ్ బాస్ 3` జూలైలో.. కింగ్ హోస్ట్!?

By:  Tupaki Desk   |   5 Jun 2019 11:18 AM GMT
`బిగ్ బాస్ 3` జూలైలో.. కింగ్ హోస్ట్!?
X
`బిగ్ బాస్ 3` రోజురోజుకి స‌స్పెన్స్ సీరియ‌ల్ లా సాగుతోంది. ఈ సీజ‌న్ మొద‌ల‌వుతుంద‌ని ఒక‌సారి.. అబ్బే ఈసారి లేదు అని ఇంకోసారి ప్ర‌చార‌మ‌వుతోంది. మీడియా స‌ర్కిల్స్ లో రోజుకో మాట వినిపిస్తుండ‌డంతో అటు బిగ్ బాస్ అభిమానుల్లో బోలెడంత క‌న్ఫ్యూజ‌న్ నెల‌కొంది. ఓవైపు ఏర్పాట్లు సాగుతున్నాయ‌ని అంటూనే.. అస‌లు దానికి సంబంధించి ఎలాంటి స‌మాచారం లేక‌పోవ‌డంతో ఈ స‌న్నివేశం కొన‌సాగుతోంది.

జూన్ లో మొద‌ల‌వుతుంద‌ని ప్ర‌చారమైనా... ఇప్ప‌టివ‌ర‌కూ దీనికి సంబంధించి హోస్ట్ ను ఫైన‌ల్ చేసి అధికారికంగా ప్ర‌క‌టించ‌క‌పోవ‌డంతో ఈ డౌట్లు రాజుకున్నాయి. అయితే తాజాగా ఓ చానెల్ ఇంట‌ర్వ్యూలో మాట్లాడిన `బిగ్ బాస్ 2` పార్టిసిపెంట్ సామ్రాట్ `బిగ్ బాస్ 3` గురించి ఆస‌క్తిక‌ర స‌మాచారం అందించారు. బిగ్ బాస్ కొత్త సీజ‌న్ తొంద‌ర్లోనే ప్రారంభమ‌వుతుంది. ఏర్పాట్లు సాగుతున్నాయి. కింగ్ నాగార్జున హోస్ట్ గా ఫైన‌ల్ అయ్యారని క‌న్ఫామ్ గా చెప్పారు సామ్రాట్. ఇక ఇందులో పార్టిసిపెంట్స్ ఎవ‌రెవ‌రు ఉంటారు? అన్న‌దానికి ఈసారి టాప్ సెల‌బ్రిటీలు ఉంటార‌ని తెలిపాడు. కొత్త సీజ‌న్ లో నా ఫ్యామిలీ నుంచి ఎవ‌రైనా ఉంటే బావుంటుంది అని ఆస‌క్తిక‌ర వ్యాఖ్య‌ను చేశాడు. అలానే ఈసారి హౌస్ లోకి నాని అన్న‌ వెళ్లాలి.. వెళితేనే క‌దా తెలిసేది! అంటూ స‌ర‌దాగా న‌వ్వేశాడు.

మొత్తానికి బిగ్ బాస్ సీజ‌న్ స‌జీవంగానే ఉంద‌ని నాగార్జున‌కు అత్యంత స‌న్నిహితుడైన సామ్రాట్ చెప్పారు కాబ‌ట్టి న‌మ్మొచ్చు. బిగ్ బాస్ 3 జూలై మిడిల్ లో ప్రారంభిస్తారని వేరొక సోర్స్ నుంచి తెలుస్తోంది. ఈసారి పార్టిసిపెంట్స్ లో బోలెడంత వినోదం పంచే వాళ్లు ఉన్నారు. మొన్న ఎన్నిక‌ల వేళ రాజ‌కీయ పార్టీ అంటూ .. బోలెడంత హ‌డావుడి చేస్తూ కామెడీని పంచిన మ‌త‌ప్ర‌బోధ‌కుడు కె.ఏ.పాల్ పేరు ఈసారి ప్ర‌ముఖంగా వినిపిస్తోంది. న‌టి- యాంక‌ర్ రేణు దేశాయ్ - యాంక‌ర్ ఉద‌య‌భాను- గాయ‌కుడు హేమ‌చంద్ర‌- జ‌బ‌ర్ధ‌స్త్ ఫేం సుధాక‌ర్- యాంక‌ర్ లాస్య‌- యాంక‌ర్ ర‌వి- యూట్యూబ్ స్టార్ మ‌హాత‌ల్లి- యాంక‌ర్ సావిత్రి త‌దిత‌రుల పేర్లు ప్ర‌ముఖంగా జాబితాలో ఉన్నాయ‌ని చెబుతున్నారు. వీళ్ల‌తో పాటు స్టార్లు ఎవ‌రైనా ఉండే ఛాన్సుంద‌ని స‌మాచారం.