Begin typing your search above and press return to search.

మెగాపవర్ స్టార్ ఉగాదికి కొత్త సినిమా అనౌన్స్ చేస్తాడా..??

By:  Tupaki Desk   |   5 April 2021 9:00 PM IST
మెగాపవర్ స్టార్ ఉగాదికి కొత్త సినిమా అనౌన్స్ చేస్తాడా..??
X
మెగాపవర్ స్టార్ రాంచరణ్ ప్రస్తుతం దర్శకధీరుడు రాజమౌళి దర్శకత్వంలో ఆర్ఆర్ఆర్ సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. పాన్ ఇండియా మూవీగా తెరకెక్కుతున్న ఆర్ఆర్ఆర్ అక్టోబర్ 13న ప్రపంచవ్యాప్తంగా విడుదల కాబోతుంది. అయితే ఆర్ఆర్ఆర్ తర్వాత మెగాహీరో రాంచరణ్ తదుపరి సినిమా ఎవరితో చేస్తాడనే ప్రశ్నకు ఇదివరకే జవాబు దొరికింది. స్టార్ డైరెక్టర్ శంకర్ దర్శకత్వంలో చరణ్ 15వ సినిమా చేయనున్నాడు. అయితే శంకర్ సినిమా తర్వాత ఎవరితో అనేది కూడా ఇప్పుడే చర్చగా మారింది. కొంతకాలంగా పలువురి దర్శకుల పేర్లు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. అయితే ఆ మధ్యలో జెర్సీ ఫేమ్ గౌతమ్ తిన్ననూరి దర్శకత్వంలో రాంచరణ్ సినిమా చేయబోతునట్లు టాక్ వినిపించింది. అయితే అందులో వాస్తవం లేదని చెప్పేసరికి ఆ న్యూస్ కనుమరుగయింది.

కానీ తాజాగా ఈ స్టార్ పెయిర్ గురించి మళ్లీ వార్తలు వెలుగులోకి వచ్చాయి. రాంచరణ్ 16వ సినిమా గురించి ఓ ఆసక్తికరమైన న్యూస్ సోషల్ మీడియాలో హల్చల్ చేస్తుంది. డైరెక్టర్ గౌతమ్ ఆల్రెడీ చరణ్ కోసం ఓ మంచి కథని సిద్ధం చేసినట్లు తెలుస్తుంది. కానీ ఈ కాంబినేషన్ పై సినీవర్గాలలో ఎన్నో ఊహగానాలు వ్యక్తం అవుతున్నాయి. రాంచరణ్ ఆర్ఆర్ఆర్ సినిమాతో పాన్ ఇండియా స్థాయిలో గుర్తింపు దక్కించుకోనున్నాడు. అందుకు తగ్గట్టుగానే కథలను ఎంపిక చేసుకుంటున్నాడట. అయితే బయటికి రాకపోయినా లోపల గౌతమ్, చరణ్ ల మధ్య డిస్కషన్స్ నడుస్తున్నాయట. వీరి కథ పై అనేక పుకార్లు వినిపిస్తుండగా.. ఈ సినిమా కమర్షియల్ జోనర్ లో ఉంటూనే హెవీ ఎమోషనల్ ఎలిమెంట్లతో ఉండబోతుందని సమాచారం. మరి ఈ గౌతమ్ తో సినిమా పై చరణ్ ఉగాదికి అనౌన్స్ చేస్తాడని టాక్. చూడాలి మరి చరణ్ నుండి ఎలాంటి న్యూస్ రానుందో!