Begin typing your search above and press return to search.

జక్కన్న మాటలతో అయినా ఊపోస్తుందా ?

By:  Tupaki Desk   |   21 Dec 2019 10:07 AM GMT
జక్కన్న మాటలతో అయినా ఊపోస్తుందా ?
X
లెజెండరి మ్యూజిక్ డైరెక్టర్ కీరవాణి తనయుడు సింహ కోడూరి హీరోగా పరిచయమవుతున్నాడు. 'మత్తు వదలరా' అనే టైటిల్ తో న్యూ ఏజ్ కాన్సెప్ట్ తో తెరకెక్కిన ఈ సినిమా వచ్చే వారమే అంటే 25న థియేటర్స్ లోకి రానుంది. అయితే ఇంతవరకూ ఈ సినిమాకు ఎలాంటి బజ్ లేదు. కీరవాణి కొడుకులిద్దరూ మల్టీ ప్లేక్స్ లకు తిరుగుతున్నప్పటికీ ప్రేక్షకుల్లో ఎలాంటి ఆసక్తి నెలకొనడం లేదు.

అందుకే ఎట్టకేలకు చిన్నాన్న రాజమౌళి సపోర్ట్ తీసుకొని సినిమాను ముందుకు తీసుకెళ్ళే ప్రయత్నం చేస్తున్నారు. ఈ రోజు జరగనున్న ప్రీ రిలీజ్ ఈవెంట్ కి కీరవాణి తో కలిసి హాజరవుతున్నాడు జక్కన్న. ఇప్పటికే సినిమా గురించి ఓ ట్వీట్ వేసి రిలీజ్ రోజు షూటింగ్ మానేసి మరి సినిమా చూస్తానంటూ చెప్పిన రాజమౌళి సాయంత్రం తన ఫ్యామిలీ హీరో గురించి కాల భైరవ గురించి నాలుగు ముక్కలు మాట్లాడి సినిమాపై హైప్ తీసుకు రానున్నాడు.

మరి జక్కన్న మాటలతో అయినా సినిమాపై బజ్ వచ్చి రిలీజ్ రోజు థియేటర్స్ కి జనాలోస్తారేమో చూడాలి.