Begin typing your search above and press return to search.

ట్రెండీ స్టోరి: మాస్ మ‌హారాజ్ ప్ర‌యోగాలు ఫ‌లిస్తాయా?

By:  Tupaki Desk   |   27 Nov 2020 10:45 AM IST
ట్రెండీ స్టోరి: మాస్ మ‌హారాజ్ ప్ర‌యోగాలు ఫ‌లిస్తాయా?
X
మాస్ మ‌హారాజా ర‌వితేజ కెరీర్ కీల‌క మ‌లుపులో ప‌రాజ‌యాల గురించి తెలిసిందే. అందుకే ఇప్పుడు బ్లాక్ బ‌స్ట‌ర్ తో కంబ్యాక్ అవ్వాల్సి ఉంది. గ‌త వైఫ‌ల్యాల దృష్ట్యా ర‌వితేజ ఇటీవ‌ల మ‌రింత జాగ్ర‌త్త‌గా ఆచితూచి క‌థ‌ల్ని ఎంచుకుంటున్నారు. ప్ర‌స్తుతం ఆడియెన్ మైండ్ సెట్ మారింది. అభిరుచి ఎంతో మారింది. అందుకు త‌గ్గ‌ట్టే క‌థ‌ల్ని ఎంపిక చేయాల‌ని ర‌వితేజ గ్ర‌హించిన‌ట్టు క‌నిపిస్తోంది.

పూర్తిగా నిజ ఘ‌ట‌న‌ల‌తో రూపొందిస్తున్న `క్రాక్` మూవీ త‌న‌కు బిగ్ బ్రేకింగ్ పాయింట్ అవుతుంద‌ని ఎంతో హోప్ తో ఉన్నాడు ర‌వితేజ. ప్ర‌స్తుతం న్యూయార్క్ లో షూటింగ్ చేస్తున్నాడు. అక్కడి నుంచి త్రోబ్యాక్ ఫోటోని షేర్ చేసిన ర‌వితేజ యాటిట్యూడ్ ప‌రంగా ఎంతో కాన్ఫిడెంట్ గా క‌నిపిస్తున్నాడు.

క్రాక్ మూవీలో శ్రుతి హాసన్- వరలక్ష్మి శరత్ కుమార్ - స‌ముదిర‌క‌ని లాంటి టాప్ కాస్టింగ్ ప్ర‌ధాన అస్సెట్ కానున్నారు. గోపిచంద్ మలినేని ఈ యాక్ష‌న్ థ్రిల్ల‌ర్ తో కంబ్యాక్ అయ్యేందుకు ఎంతో శ్ర‌ద్ధగా ప‌ని చేస్తున్నారు.

క్రాక్ తో పాటు ప్రస్తుతం బ్యాక్ టు బ్యాక్ సినిమాల‌పై క‌స‌ర‌త్తు చేస్తున్నాడు ర‌వితేజ‌. ఆర్‌.టి 67 కి ర‌వితేజ స‌న్నాహ‌కాల్లో ఉన్నారు. ఈ చిత్రానికి రమేష్ వర్మ దర్శకత్వం వహిస్తున్నారు. ఇప్ప‌టికే ప్రీప్రొడ‌క్ష‌న్ సాగుతోంది. 2020 జనవరిలో విడుదలైన డిస్కో రాజా చిత్రం చ‌క్క‌ని బ్లాక్ బ‌స్ట‌ర్ గా నిలిచానా శ్రీను వైట్ల తెర‌కెక్కించిన అమ‌ర్ అక్బ‌ర్ ఆంటోని ఫ్లాప‌వ్వ‌డం పెద్ద మైన‌స్ అయ్యింది. క‌థ‌ల‌ ఎంపిక‌ల్లో వైవిధ్యం పాటించడం ద్వారా ర‌వితేజ కంబ్యాక్ అయ్యేందుకు ప్ర‌య‌త్నిస్తున్నారు. ఇప్ప‌టికే మ‌రో రెండు క‌థ‌ల్ని కూడా ర‌వితేజ లాక్ చేసాడ‌న్న గుస‌గుస‌లు వినిపిస్తున్నాయి. ప్ర‌యోగాత్మ‌క సినిమాల‌కు టైమ్ న‌డుస్తోంది. క్రాక్ .. ఆర్.టి 67 చిత్రాల‌తో ఈసారి ఆశించిన పెద్ద రేంజు స‌క్సెస్ ని అందుకుంటాడ‌నే ఆశిద్దాం.