Begin typing your search above and press return to search.

మ‌హేష్ సెంటిమెంట్ ద‌ళ‌ప‌తికి క‌లిసొస్తుందా?

By:  Tupaki Desk   |   29 Sep 2021 1:30 PM GMT
మ‌హేష్ సెంటిమెంట్ ద‌ళ‌ప‌తికి క‌లిసొస్తుందా?
X
సూప‌ర్ స్టార్ మ‌హేష్ ప్రారంభోత్స‌వంలో క‌నిపించరు ఎందుక‌ని.. ? ఇది చాలా మంది సందేహం. ఆయ‌న నేరుగా ఆన్ సెట్స్ రెగ్యుల‌ర్ షూట్ లో మాత్ర‌మే పాల్గొంటారు. రెగ్యుల‌ర్ షూటింగ్ ప్రారంభ‌మైన‌ప్పుడు మాత్ర‌మే టీమ్ లో జాయిన్ అవుతారు. ఆ త‌ర్వాత మ‌ళ్లీ అవ‌స‌రం అనుకుంటే! ప్ర‌మోష‌న్ కు హాజ‌ర‌వుతారు. లేదంటే నేరుగా తెరపైనే ఆయ‌న్ని చూసుకోవాల్సి ఉంటుంది. సినిమా ప్రారంభోత్స‌వంలో క‌నిపించ‌డం చాలా రేర్.

మ‌హేష్ తో క‌మిట్ అయిన ద‌ర్శ‌క‌..నిర్మాత‌ల‌కు సింపుల్ గా టెంపుల్ లోనో..త‌మ ఆఫీస్ లో ప్రారంభోత్స‌వం జ‌రుపుకుని..షూటింగ్ డేట్ల‌ను వెల్ల‌డిస్తారు. ఆ త‌ర్వాత మ‌హేష్ జాయిన్ అవుతారు. ఇలా త‌న సినిమా ప్రారంభోత్స‌వంలో మ‌హేష్ పాల్గొన‌రు? అనే విమ‌ర్శ‌ని చాలా కాలంగానే మోస్తున్నారు. అలాంటి మ‌హేష్ తాజాగా కోలీవుడ్ స్టార్ సినిమా లాంచింగ్ కి ముఖ్య అతిధిగా వెళ్ల‌డం విశేషం. మ‌రి ఆ స్టార్ హీరో ఎవ‌రు? లాంచింగ్ కోసం హైద‌రాబాద్ నుంచి చెన్నైకి వెళ్తున్నారా? వంటి వివ‌రాల్లోకి వెళితే...

ఇల‌యద‌ళ‌ప‌తి విజ‌య్ క‌థానాయ‌కుడిగా వంశీ పైడి ప‌ల్లి ద‌ర్శ‌క‌త్వంలో దిల్ రాజు నిర్మాత‌గా తెలుగులో ఓ చిత్రం తెర‌కెక్క‌నున్న సంగ‌తి తెలిసిందే. ఈ సినిమా త్వ‌ర‌లోనే హైద‌రాబాద్ లో పూజా కార్య‌క్ర‌మాల‌తో ప్రారంభోత్స‌వం జ‌ర‌గ‌నుంది. ఈ నేప‌థ్యంలో ఈ కార్య‌క్ర‌మానికి మ‌హేష్ ముఖ్య అతిధిగా విచ్చేసి క్లాప్ కొట్ట‌నున్నార‌నే ప్ర‌చారం తెర‌పైకి వ‌చ్చింది.

మ‌రి త‌న సినిమా ప్రారంభోత్స‌వానికి వెళ్ల‌ని మ‌హేష్ విజ‌య్ సినిమా కు ఎందుకు వెళ్తున్న‌ట్లు? అంటే ఆస‌క్తిక‌ర సంగ‌తే ఉంది. మ‌రి విజ‌య్-మ‌హేష్ మ‌ధ్య స్నేహం ఉందా? లేదా? అన్న‌ది క్లారిటీ లేదు గానీ..చెన్నై సిటీతో మ‌హేష్ కి అనుబంధం మాత్రం చాలా ప్ర‌త్యేక‌మైన‌ద‌ని అందరికీ తెలిసిందే. ఇక దిల్ రాజు-వంశీ పైడిప‌ల్లి అయితే నిర్మాత ద‌ర్శ‌కుడు అనే కంటే ఆ ఇద్ద‌రితో మ‌హేష్ చాలా క్లోజ్ ఫ్రెండ్ లా మూవ్ అవుతారు. దిల్ రాజు బ్యాన‌ర్లో మ‌హేష్ మూడు సినిమాలు చేసారు. వంశీ మ‌హేష్ తో `మ‌హ‌ర్షి` చిత్రాన్ని తెర‌కెక్కించి బ్లాక్ బ‌స్ట‌ర్ అందించారు. అప్ప‌టి నుంచి ముగ్గురి మ‌ధ్య బాండింగ్ మ‌రింత స్ట్రాంగ్ అయింది.

బ‌హుశా ఆ ఇద్ద‌రు కోర‌డంతోనే మ‌హేష్ కాద‌న‌లేక విజ‌య్ సినిమా లాంచింగ్ కి హాజ‌ర‌వుతున్న‌ట్లు తెలుస్తోంది. ఇక మ‌హేష్ త‌న సినిమా ప్రారంభోత్స‌వంలో ఎందుకు పాల్గొన‌రంటే? అదొక ర‌క‌మైన సెంటిమెంట్...లాంచింగ్ లో పాల్గొంటే త‌న సినిమాకు క‌లిసిరాద‌ని మ‌హేష్ న‌మ్ముతారట‌. అందుకే ఆయ‌న త‌న సినిమా ప్రారంభోత్స‌వంలో పాల్గొన‌ర‌ని ప‌రిశ్ర‌మ వ‌ర్గాల్లో టాక్ నిరంత‌రం వినిపిస్తుంది.