Begin typing your search above and press return to search.

ఛీటర్స్ భరతం పట్టే సూపర్ స్టార్ ?

By:  Tupaki Desk   |   29 May 2019 2:55 PM IST
ఛీటర్స్ భరతం పట్టే సూపర్ స్టార్ ?
X
అసలు షూటింగులు కూడా మొదలుకాకుండా తన సినిమాల గురించి విపరీతమైన చర్చ జరిగేలా చేయడం ఒక్క మహేష్ బాబుకే సాధ్యమేమో. ఇంకా అనిల్ రావిపూడితో తన 26వ సినిమా మొదలుకాకుండానే అప్పుడే మహేష్ 27 మీద రకరకల వార్తలు ప్రచారంలోకి వస్తున్నాయి. అందులో ముఖ్యంగా పరశురామ్ ప్రిన్స్ ని తన లైన్ తో ఇంప్రెస్ చేసినట్టుగా వచ్చిన న్యూస్ బాగా హై లైట్ అవుతోంది.

స్టోరీ లైన్ మీద కూడా ఫిలిం నగర్ సర్కిల్స్ లో చర్చలు జరుగుతున్నాయి. ఎలా లీకయ్యిందో కానీ ఆ డిస్కషన్ ప్రకారం ఇందులో మహేష్ పాత్ర ఆర్థిక నేరాలు చేసే విలన్ భరతం పట్టే పాత్రలో వెరైటీగా ఉంటుందట. విలన్ కు తన కుటుంబానికి లింక్ ఉండటంతో ముందు పర్సనల్ గా తీసుకున్నా తర్వాత సమాజం కోసం ఫైట్ చేసేలా సాగుతుందట

ఇదంతా బాగానే ఉంది కానీ ఇది మరీ కొత్త లైన్ అయితే కాదు. అప్పుడెప్పుడో ఎస్వి కృష్ణారెడ్డి అచ్చం ఇదే తరహాలో జగపతిబాబు హీరోగా అతడే ఒక సైన్యం అని తీశాడు. అది అంతగా వర్క్ అవుట్ కాలేదు కానీ టీవీలో హిట్టు కొట్టింది. అందులో విలన్ ప్రకాష్ రాజ్ హీరో నాన్న సుమన్ ను ఆర్థికంగా మోసం చేస్తే మైండ్ గేమ్ ఆడి జగపతిబాబు అతన్ని పతనం చేస్తాడు.

ఇదే ఫార్ములా సుకుమార్ జూనియర్ ఎన్టీఆర్ ల నాన్నకు ప్రేమతోలో చూడొచ్చు. ఇది సీరియస్ గా సాగే డ్రామా. మరి ఇప్పుడు ప్రచారంలోకి వచ్చిన పరశురామ్ లైన్ వీటికి చాలా దగ్గరగా ఉన్నట్టు అనిపిస్తోంది. నిజమో కాదో అధికారిక ధ్రువీకరణ లేదు కాబట్టి మహేష్ ఫ్యాన్స్ లైట్ తీసుకోవచ్చు. కథ ఎప్పటిదైనా ట్రీట్మెంట్ పర్ఫెక్ట్ గా ఉంటే ఈ పోలికలు చేసేదేముండదు కానీ ప్రెజెంటేషన్ లో జాగ్రత్తలు తీసుకొకపోతే మహర్షి తరహాలో కామెంట్స్ తప్పవు.