Begin typing your search above and press return to search.

రౌడీకి మ‌హేష్ ఆఫ‌ర్ తాజా సంగ‌తి!

By:  Tupaki Desk   |   26 July 2019 10:04 AM IST
రౌడీకి మ‌హేష్ ఆఫ‌ర్ తాజా సంగ‌తి!
X
క్రేజ్ ఉన్న హీరో వెంట‌ప‌డ‌టం స‌ర్వ‌సాధార‌ణం. ఆ క్రేజును ఎలా క్యాష్ చేసుకోవాలా అన్న ఆలోచ‌న ఉంటుంది. ప‌రిశ్ర‌మ అగ్ర నిర్మాత‌లు ఈ విష‌యంలో అడ్వాన్స్ డ్ ప్లాన్ తో ఉంటారు. ఇప్పుడు అదే బాట‌లో సూప‌ర్ స్టార్ మ‌హేష్ క్రేజీ యంగ్ హీరోల వెంట ప‌డుతుండ‌డం హాట్ టాపిక్ గా మారింది. ఇప్ప‌టికే అడివి శేష్ హీరోగా `మేజ‌ర్` అనే ప్రాజెక్ట్ చేస్తున్నారు. 26/11 ముంబై దాడుల్లో చ‌నిపోయిన మేజ‌ర్ సందీప్ ఉన్నిక్రిష్ణ‌న్ జీవిత‌కథ ఆధారంగా ఈ సినిమా చేయ‌నున్నారు. మ‌రో క్రేజీ హీరో విజ‌య్ దేవ‌ర‌కొండ‌ను మ‌హేష్‌ లాక్ చేసే ప్లాన్ లో ఉన్నారు.

త్వ‌ర‌లోనే ఎంబీ ఎంట‌ర్‌టైన్‌మెంట్స్ లో విజ‌య్ దేవ‌ర‌కొండ హీరోగా ఓ సినిమాని తెర‌పైకి తీసుకురాబోతున్నార‌ని ఇదివ‌ర‌కూ వార్త‌లొచ్చాయి. అందులో భాగంగానే `మ‌హ‌ర్షి` ప్రీరిలీజ్ ఈ వెంట్ కి విజ‌య్ దేవ‌ర‌కొండ‌ని ఓ గెస్ట్‌గా పిలిచి రౌడీ హీరోని మ‌హేష్ తెలివిగా లాక్ చేశార‌ని ఫిల్మ్ న‌గ‌ర్ లో ముచ్చ‌టా సాగింది. తాజాగా ఈ సినిమాకి సంబంధించిన మ‌రో అప్ డేట్ తెలిసింది.

ప్ర‌స్తుతం దేవ‌ర‌కొండ‌తో చిత్రానికి ద‌ర్శ‌కుడిని ఫైన‌ల్ చేసే ప‌నిలో ఉన్నార‌ట మ‌హేష్. ఇప్ప‌టికే నిర్మాణ బాధ్య‌త‌ల్ని న‌మ్ర‌త చూసుకుంటున్నారు. దేవ‌ర‌కొండ `డియ‌ర్ కామ్రేడ్‌` ఈ శుక్ర‌వారం రిలీజైంది కాబ‌ట్టి ఈ ప్రాజెక్టు ప‌నుల్లో వేగం పెంచుతున్నార‌ని తెలుస్తోంది. రౌడీ త‌దుప‌రి `ఓన‌మాలు` ఫేమ్ క్రాంతి మాధ‌వ్ ద‌ర్శ‌క‌త్వంలో కె.ఎస్‌.రామారావు నిర్మిస్తున్న చిత్రం.. మైత్రీ మూవీస్ `హీరో` రెండిటినీ పూర్తి చేయాల్సి ఉంది. అటుపైనా మ‌రికొంత మంది సినిమా చేయ‌మ‌ని అడుగుతున్నా ఎవ‌రికీ విజ‌య్ మాటివ్వ‌లేదట‌. మ‌హేష్ బ్యాన‌ర్ సినిమా కోస‌మే కాల్షీట్లు రిజ‌ర్వ్ చేసే ఆలోచ‌న‌లో ఉన్నాడ‌ని తెలుస్తోంది. ఇక దేవ‌ర‌కొండ‌కు గీత గోవిందం- టాక్సీవాలా రూపంలో గీతా ఆర్ట్స్ కాంపౌండ్ కాన్ఫిడెన్స్ పెంచిన సంగ‌తి తెలిసిందే.