Begin typing your search above and press return to search.

రకుల్ కు అక్కడైన లక్ కలిసి వచ్చేనా?

By:  Tupaki Desk   |   22 Feb 2021 5:30 AM GMT
రకుల్ కు అక్కడైన లక్ కలిసి వచ్చేనా?
X
టాలీవుడ్ లో స్టార్ హీరోయిన్ గా వరుసగా సినిమాలు చేసిన ముద్దుగుమ్మ రకుల్ ప్రీత్ సింగ్ కు సినిమాలు తగ్గాయి. ఈ అమ్మడు అడపాదడపా వస్తున్న ఆఫర్ల తో కెరీర్ ను నెట్టుకు వస్తుంది. తెలుగు లో ఈమె చేస్తున్నది ఒకటి రెండు సినిమాలు మాత్రమే. మరో వైపు బాలీవుడ్ లో కూడా ఈమె సినిమాలు చేసేందుకు ప్రయత్నాలు చేస్తోంది. అందులో భాగంగా ఈమె జాన్ అబ్రహం తో కలిసి 'ఎటాక్' సినిమా చేసింది. ఆ సినిమాపై రకుల్ కు భారీ అంచనాలు ఉన్నాయి.

ఎటాక్ సినిమా షూటింగ్ కంటిన్యూగా చేస్తున్నారు. ఈ సినిమా ను ఆగస్టు విడుదల చేయబోతున్నట్లుగా అధికారికంగా ప్రకటన వచ్చింది. షూటింగ్ స్పీడ్ గా జరుగుతున్న ఈ సినిమా ను ఆగస్టు 13న విడుదల చేయబోతున్నట్లుగా అధికారిక ప్రకటన వచ్చింది. లక్ష్య రాజ్ ఆనంద్ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ సినిమా లో రకుల్ తో పాటు బాలీవుడ్ హాట్ బ్యూటీ జాక్వెలిన్ ఫెర్నాండెజ్ మరో హీరోయిన్ గా కనిపించబోతుంది. ఈ సినిమాపై రకుల్ చాలా ఆశలే పెట్టుకుంది. మరి ఈ సినిమా రకుల్ కు బాలీవుడ్ ఆఫర్ లను తెచ్చిపెడుతుందా అనేది చూడాలి.