Begin typing your search above and press return to search.

'లాల్ సింగ్ చద్దా' మూవీ 'కేజీయఫ్ 2' ను క్రాస్ చేస్తుందా..?

By:  Tupaki Desk   |   30 May 2022 4:28 AM GMT
లాల్ సింగ్ చద్దా మూవీ కేజీయఫ్ 2 ను క్రాస్ చేస్తుందా..?
X
బాలీవుడ్ మిస్టర్ పర్ఫెక్ట్ అమీర్ ఖాన్ కథానాయకుడిగా నటించిన తాజా చిత్రం ''లాల్ సింగ్ చద్దా''. కరీనా కపూర్ ఖాన్ హీరోయిన్ గా నటించిన ఈ సినిమాలో యువసామ్రాట్ నాగచైతన్య కీలక పాత్ర పోషించారు. ఇది అక్కినేని హీరోకి హిందీ డెబ్యూ మూవీ. దీంతో తెలుగు ప్రేక్షకుల్లోనూ ఈ సినిమాపై ఆసక్తి నెలకొంది.

కరోనా పాండమిక్ నేపథ్యంలో వాయిదా పడుతూ వస్తోన్న ''లాల్ సింగ్ చద్దా'' సినిమా ఎట్టకేలకు రిలీజ్ కు రెడీ అయింది. 2022 ఆగష్టు 11న ప్రపంచ వ్యాప్తంగా భారీ స్థాయిలో విడుదల కాబోతోంది. ఇప్పటికే వచ్చిన రెండు పాటలకు మంచి ఆదరణ లభించింది. ఈ నేపథ్యంలో మేకర్స్ ఆదివారం సాయంత్రం ట్రైలర్ ను లాంచ్ చేశారు.

ట్రైలర్ లో 'లాల్ సింగ్ చద్దా' మెయిన్ ప్లాట్ తప్ప కథ గురించి పెద్దగా వెల్లడించలేదు. మానసికంగా ఎదుగుదలేని లాల్ సింగ్ జీవితంలోని వివిధ దశలను చూపించే ఎమోషనల్ ఫన్ రైడ్ గా ఈ సినిమా ఉండబోతోందని తెలుస్తోంది. అభిమానులకు కోరుకున్నట్లు అన్ని రకాల ఎలిమెంట్స్‌ ఉన్నట్లు హింట్ ఇచ్చారు.

ఆద్యంతం ఆసక్తింగా సాగిన ఈ ట్రైలర్‌ లో ఆమీర్‌ ఖాన్ - నాగ చైతన్య కొత్త లుక్‌ లో ఆకట్టుకున్నారు. అమీర్ మరోసారి తనదైన యాక్టింగ్ తో అలరించగా.. సైన్యంలో ఆమిర్‌ కు స్నేహితుడిగా చైతన్య మెప్పించారు. చై ఇందులో సర్ప్రైజింగ్ ఎలిమెంట్ అని అర్థం అవుతోంది.

'లాల్ సింగ్ చద్దా' ఇటీవల కాలంలో బాలీవుడ్ నుండి మోస్ట్ లవబుల్ ట్రైలర్ అని చెప్పాలి. సినిమాపై ఏర్పడిన హైప్ మరియు బజ్ కారణంగా.. ఈ సినిమా కచ్చితంగా బాక్సాఫీస్ వద్ద గట్టి ప్రభావం చూపుతుందని సినీ అభిమానులు నమ్ముతున్నారు.

ప్రత్యేకించి అమీర్ ఖాన్ నటించిన 'దంగల్' మూవీ హిస్టారిక్ లాంగ్ రన్ రూ. 387 కోట్లను మరియు 'కేజీఎఫ్: చాప్టర్ 2' (430+ కోట్లు) వసూళ్లను అధిగమించి సరికొత్త రికార్డులను నెలకొల్పుతుందని బాలీవుడ్ జనాలు ధీమా వ్యక్తం చేస్తున్నారు.

ఈ మధ్య బాలీవుడ్ సినిమాలు బాక్సాఫీస్ వద్ద ఆశించిన స్థాయిలో వసూళ్ళు రాబట్టలేకపోతున్నాయి. 'ది కశ్మీర్ ఫైల్స్' 'భూల్ బులయ్యా 2' మినహా మరే సినిమా విజయం సాధించలేదు. ఇప్పుడు అమీర్ సినిమాపైనే ఆశలు పెట్టుకున్నారు.

హాలీవుడ్‌ సినిమా 'ఫారెస్ట్‌ గంప్‌' అఫీషియల్ రీమేక్ గా ''లాల్ సింగ్ చద్దా'' మూవీ తెరకెక్కింది. అద్వైత్‌ చందన్‌ ఈ ఎమోషనల్ కామెడీ డ్రామాకి దర్శకత్వం వహించారు. ఆమిర్‌ ఖాన్ ప్రొడ‌క్ష‌న్స్‌ - వయ్ కామ్18 స్టూడీయోస్ బ్యాన‌ర్‌ ల‌పై ఆమిర్‌ ఖాన్‌ - కిర‌ణ్‌రావు - జ్యోతి దేశ్‌ పాండే - అజిత్ అందారే సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మించారు.