Begin typing your search above and press return to search.

కియ‌రా ఫేట్ మార్చే మ‌రొక‌టి అవుతుందా?

By:  Tupaki Desk   |   20 April 2021 6:30 AM GMT
కియ‌రా ఫేట్ మార్చే మ‌రొక‌టి అవుతుందా?
X
టాలీవుడ్ బాలీవుడ్ లో కియ‌రా అద్వాణీ పేరు మార్మోగుతోంది. తెలుగులో ఎన్ని ఆఫ‌ర్లు వ‌చ్చినా ఈ అమ్మ‌డు హిందీ అవ‌కాశాల్ని వ‌దులుకోలేక అంగీక‌రించ‌డం లేదు. మునుముందు తెలుగులో ఒక అగ్ర హీరో స‌ర‌స‌న కియ‌రా న‌టించ‌నుంద‌ని క‌థ‌నాలొస్తున్నాయి.

ఈలోగానే ఈ బ్యూటీ బాలీవుడ్ లో తెర‌కెక్కుతున్న అప‌రిచితుడు (అన్నియ‌న్) రీమేక్ కి సంత‌కం చేసి హాట్ టాపిక్ గా మారింది. క‌బీర్ సింగ్ త‌ర్వాత మ‌ళ్లీ ఇది త‌న కెరీర్ కి క్రేజీ ప్రాజెక్ట్. శంక‌ర్ ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్న ఈ హిందీ రీమేక్ లో ర‌ణ‌వీర్ సింగ్ క‌థానాయ‌కుడిగా న‌టిస్తుంటే అత‌డి స‌ర‌స‌న కియ‌రా న‌టించ‌నుంది. గ‌త‌ శుక్రవారం ఒప్పందం కుదుర్చుకుందని క‌థ‌నాలొస్తున్నాయి.

ఈ సినిమా హక్కుల విష‌యంలో నిర్మాత వి రవిచంద్రన్ తో శంక‌ర్ వివాదం గురించి తెలిసిన‌దే. ఓవైపు వివాదం న‌డుస్తున్నా ఈలోగానే కియ‌రాను ఫైన‌ల్ చేశార‌న్న వార్త వేడెక్కించింది. ఇక‌పోతే అప‌రిచితుడులో స‌దా పోషించిన పాత్ర‌లోనే కియ‌రా న‌టించ‌నుంది. అందాల కియ‌రా త‌న కెరీర్ లోనే మేలిమలుపు ఈ పాత్ర అని టాక్ వినిపిస్తోంది.

నేటితో కియ‌రా న‌టించిన భ‌ర‌త్ అనే నేను మూడు సంవ‌త్స‌రాలు పూర్తి చేసుకుంది. ఈ సంద‌ర్భంగా ట్విట్ట‌ర్ లో త‌న ఆనందం వ్య‌క్తం చేసింది కియ‌రా. అప‌రిచితుడు హిందీ రీమేక్ ని పెన్ స్టూడియోస్ అధినేత‌ జయంతిలాల్ గడా నిర్మిస్తున్నారు.