Begin typing your search above and press return to search.

రౌడీ స్టార్‌ కు మళ్లీ అది రిపీట్‌ అయ్యేనా?

By:  Tupaki Desk   |   8 Feb 2020 12:33 PM IST
రౌడీ స్టార్‌ కు మళ్లీ అది రిపీట్‌ అయ్యేనా?
X
డియర్‌ కామ్రేడ్‌ తో నిరాశ పర్చిన విజయ్‌ దేవరకొండ వరల్డ్‌ ఫేమస్‌ లవర్‌ తో మరో వారం రోజుల్లో ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు రెడీ అయ్యాడు. ఈ చిత్రం ట్రైలర్‌ ను తాజాగా విడుదల చేశారు. ట్రైలర్‌ అంతా కన్ఫ్యూజ్‌ గా అర్థం కాకుండా గందరగోళంగా ఉన్నా కూడా రౌడీ ఫ్యాన్స్‌ తెగ చూస్తున్నారు. ఇప్పటికే 5.5 మిలియన్‌ వ్యూస్‌ ను రాబట్టింది. గతంలో కూడా విజయ్‌ దేవరకొండ పాటలు.. ట్రైలర్‌ లకు యూట్యూబ్‌ లో మంచి స్పందన వచ్చింది.

యూట్యూబ్‌ లో బాగా పాపులర్‌ అవ్వడంతో డియర్‌ కామ్రేడ్‌ సినిమాకు ఒక మోస్తరు ఓపెనింగ్స్‌ నమోదు అయ్యాయి. సోషల్‌ మీడియా ప్రమోషన్‌ తో ప్రేక్షకుల్లో సినిమాపై ఆసక్తిని కలిగించడంలో విజయ్‌ దేవరకొండ ఎప్పటికప్పుడు సక్సెస్‌ అవుతూనే ఉన్నాడు. ప్రస్తుతం వరల్డ్‌ ఫేమస్‌ లవర్‌ చిత్రంతో కూడా సోషల్‌ మీడియా లో సందడి చేస్తున్నాడు. ఈ ట్రైలర్‌ జోరు చూస్తుంటే త్వరలోనే కోటి వ్యూస్‌ ను చేరుకునే అవకాశం కనిపిస్తుంది.

ఈ జోరు ఓపెనింగ్స్‌ విషయంలో కూడా కనిపిస్తుందనే టాక్‌ వినిపిస్తుంది. అయితే సినిమాను ఎక్కువ థియేటర్లలో విడుదల చేయలేక పోతున్నారు. నిర్మాత మరియు బయ్యర్లు ఎంత ప్రయత్నించినా కూడా ఒక మోస్తరు థియేటర్లు మాత్రమే ఈ సినిమా కు లభించినట్లు గా సమాచారం అందుతోంది. సినిమాకు పాజిటివ్‌ టాక్‌ వస్తే అప్పుడు థియేటర్ల సంఖ్య పెంచే అవకాశం ఉందని ఇండస్ట్రీ వర్గాల్లో టాక్‌ వినిపిస్తుంది. విజయ్‌ దేవరకొండ మూవీ అనగానే నెటిజన్స్‌ చాలా ఆసక్తి చూపుతున్నారు. మరి ఆ ఆసక్తి గతంలో మాదిరిగా మంచి ఓపెనింగ్స్‌ గా మారుతుందా లేదా అనేది చూడాలి.