Begin typing your search above and press return to search.

నితిన్ - సాయి తేజ్ మ‌ల్టీస్టార‌ర్ అనుకోవాలా?

By:  Tupaki Desk   |   19 May 2020 9:45 AM IST
నితిన్ - సాయి తేజ్ మ‌ల్టీస్టార‌ర్ అనుకోవాలా?
X
మాస్ డైరెక్ట‌ర్ హ‌రీష్ శంక‌ర్ లైన‌ప్ చూస్తుంటే షాక్ తినాల్సిందే. ఇప్ప‌టికిప్పుడు అత‌డు ప‌వ‌ర్ స్టార్ ప‌వ‌న్ క‌ల్యాణ్ ని డైరెక్ట్ చేసేందుకు స్క్రిప్టును రెడీ చేస్తున్నాడు. ఈ సినిమా వ‌చ్చే ఏడాది సెట్స్ పైకి వెళ్ల‌నుంది. ప‌వ‌న్ కెరీర్ 28వ సినిమా ఇది. ఆ త‌ర్వాత ప‌లువురు క్రేజీ హీరోల‌తో సినిమాలు చేయ‌నున్నాడు.

సేమ్ టైమ్ 14 రీల్స్ ప్ల‌స్ లో సినిమాని హ‌రీష్ శంక‌ర్ ఖాయం చేసుకున్న సంగ‌తి తెలిసిందే‌. ఇప్ప‌టికే ఈ మూవీని అధికారికంగా నిర్మాత‌లు ప్రకటించారు. 14 రీల్స్ ప్లస్ నిర్మాతలలో ఒకరైన రామ్ అచంట‌ ఈ ప్రాజెక్ట్ పూర్తి వివరాలను లాక్ డౌన్ తొల‌గించాక ప్రకటించనున్నార‌ట‌. ఇంత‌కీ ఈ సినిమాలో హీరో ఎవ‌రు? అంటే ప‌లు ఆస‌క్తిక‌ర సంగ‌తులు తెలిశాయి.

ఇందులో యూత్ స్టార్ నితిన్ - సుప్రీం హీరో సాయి తేజ్ ప్రధాన పాత్రలు పోషించేందుకు పోటీప‌డుతున్నార‌ట‌. లాక్ డౌన్ ఎత్తివేశాక‌ క‌థానాయ‌కులు స‌హా ఇత‌ర టెక్నీషియ‌న్ల‌ వివ‌రాల్ని ప్రకటిస్తార‌ట‌. అయితే ఇది మ‌ల్టీస్టార‌ర్ స్క్రిప్టునా? నితిన్ - సాయి తేజ్ మ‌ల్టీస్టార‌ర్ అని భావించాలా? లేక ఇందులో ఒక హీరో కేవ‌లం అతిథిగా మెరుస్తారా? అన్న‌ది చూడాలి.

అన్న‌ట్టు ఈ రెండు సినిమాల‌తో పాటు హరీష్ శంక‌ర్ త‌దుప‌రి పీవీపీ బ్యాన‌ర్ లోనూ సినిమా చేస్తాడా? అన్న‌ది చూడాలి. దువ్వాడ జ‌గ‌న్నాథం (డీజే) ని మించే సినిమా చేద్దామ‌ని ఆయ‌న ప్రామిస్ చేశారు కాబ‌ట్టి బండ్ల(వివాదం త‌ర్వాత‌)‌కు అవ‌కాశం ఇవ్వ‌కుండా పీవీపీకి హ‌రీష్ ఛాన్సిస్తాడేమో చూడాలి.