Begin typing your search above and press return to search.

'హీరోపంథి 2' ఓటీటీలో అయినా మెప్పిస్తుందా?

By:  Tupaki Desk   |   26 May 2022 1:30 PM GMT
హీరోపంథి 2 ఓటీటీలో అయినా మెప్పిస్తుందా?
X
బాలీవుడ్ యాక్ష‌న్ హీరో టైగర్ ష్రాఫ్ న‌టించిన హీరో పంథి 2 థియేట్రిక‌ల్ ర‌న్ ఆశించిన ఫ‌లితాన్ని ఇవ్వ‌ని సంగ‌తి తెలిసిందే. ఆర్.ఆర్.ఆర్ - కేజీఎఫ్ 2 లాంటి సౌత్ పాన్ ఇండియా సినిమాల మ‌ధ్య న‌లిగిపోయింద‌న్న క‌థ‌నాలు వేడెక్కించాయి. హీరో పంథి 2లో టైగ‌ర్ తో పాటు నవాజుద్దీన్ సిద్ధిఖీ - తారా సుతారియా లాంటి టాప్ స్టార్లు న‌టించారు. ఈ చిత్రం మే 27న‌ అంటే రేప‌టి నుంచి అమెజాన్ ప్రైమ్ వీడియోలో ప్రసారం కానుంది.

అమెజాన్ ప్రైమ్ వీడియో ఈరోజు మిడ్ నైట్ నుండి హీరోపంథి 2 ప్రత్యేకమైన స్ట్రీమింగ్ ప్రీమియర్ ను అధికారికంగా ప్రకటించింది. ఈ చిత్రం కంప్యూటర్ మేధావి అయిన బబ్లూ (టైగర్ ష్రాఫ్) .. స్వీయ-నిర్మిత బిలియనీర్ అయిన ఇనాయా (తారా సుతారియా)పై దృష్టి పెడుతుంది. ఇద్దరూ ప్రేమలో పడతారు కానీ అనుకోని కారణాల వల్ల సడెన్ గా విడిపోతారు.

వారు తిరిగి కలిసినప్పుడు మ్యాట‌ర్స్ అన్నీ ఆసక్తికరమైన మలుపు తీసుకుంటాయి. ఆపై యాక్షన్- డ్రామా- రొమాన్స్ థ్రిల్స్ తో సాగుతుంది. హీరోపంతి 2కి అహ్మ‌ద్ ఖాన్ దర్శకత్వం వహించారు. అహ్మద్ ఖాన్ - నడియాద్వాలా గ్రాండ్ సన్ ఎంటర్ టైన్ మెంట్ బ్యానర్ పై సాజిద్ నడియాద్వాలా ఈ మూవీని నిర్మించారు.

ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్ ప్రీమియర్ గురించి టైగర్ ష్రాఫ్ మాట్లాడుతూ.. "హీరోపంతి 2 పూర్తి ఎంటర్ టైనర్.. ఈ చిత్రం డిజిటల్ ప్రీమియర్ ను అమెజాన్ ప్రైమ్ వీడియోలో ప్రకటించినందుకు సంతోషంగా ఉంది. ఎందుకంటే ఇది మాకు అంతటా సినీ ప్రేమికులకు చేరువయ్యేందుకు సహాయపడుతుంది. భారీ యాక్షన్- రొమాన్స్ - ట్విస్ట్ లు టర్న్ లతో నిండిన సినిమాను ప్రేక్షకులు ఆస్వాధిస్తారు.

నేను ఈ చిత్రానికి పని చేయడం చాలా ఆనందంగా ఉంది. ముఖ్యంగా యాక్షన్ సీక్వెన్స్ లు ప్ర‌త్యేకంగా అల‌రిస్తాయి. ప్రపంచవ్యాప్తంగా ఉన్న నా అభిమానులు ఇప్పుడు తమ ఇళ్లలో నుండి సినిమాను ఆస్వాధించగలరనే వార్త‌తో థ్రిల్లింగ్ గా ఉన్నాను'' అన్నారు.

హీరోపంతి 2 లో చాలా యాక్షన్, .. డ్రామా,.. రొమాన్స్ .. కామెడీ ఉన్నాయని వాటిని మన ప్రేక్షకులు ఆనందిస్తారని తారా సుతారియా అన్నారు. మేము ప్రపంచంలోని చాలా దేశాలలో అరుదైన లొకేషన్ల‌లో ఈ చిత్రాన్ని రూపొందించాము. మహమ్మారి లోనూ చిత్రీకరించాము. ఇది మనందరికీ చాలా ప్రత్యేకమైన అనుభవం. మే 27న అమెజాన్ ప్రైమ్ వీడియో వంటి అపురూపమైన స్ట్రీమింగ్ సర్వీస్ లో దీన్ని ఎట్టకేలకు షేర్ చేయగలనని నేను ఎదురుచూస్తున్నాను! అని తారా సుతారియా అన్నారు.