Begin typing your search above and press return to search.

రిలీజ్ డేట్స్ కోసం కొట్టుకోవాల్సి వస్తుందేమో..!

By:  Tupaki Desk   |   27 May 2021 9:00 PM IST
రిలీజ్ డేట్స్ కోసం కొట్టుకోవాల్సి వస్తుందేమో..!
X
కరోనా మహమ్మారి కారణంగా సమ్మర్ లో రిలీజ్ కావాల్సిన సినిమాలన్నీ వాయిదా పడ్డాయి. ఇప్పట్లో థియేటర్స్ ఓపెన్ చేసే అవకాశం లేదని భావించిన చిన్న సినిమాలు ఓటీటీ బాట పడుతున్నాయి. పెద్ద సినిమాలు మాత్రం థియేటర్లలోనే రావాలని ఎదురు చూస్తున్నాయి. లాక్ డౌన్ తో సినిమా షూటింగులు కూడా నిలిచిపోయాయి. అయితే గత వారం రోజుల నుంచి కోవిడ్ కేసులు కాస్త తగ్గుముఖం పట్టడంతో వచ్చే నెల చివరికల్లా ప్రభుత్వాలు షూటింగ్స్ కి అనుమతిచ్చే అవకాశం ఉందని నిపుణులు అంచనా వేస్తున్నారు.

ఇదే కనుక జరిగితే ఇప్పటికే మెజారిటీ భాగం చిత్రీకరణ జరుపుకున్న సినిమాలన్నీ రెడీ అయిపోతాయి. టాలీవుడ్ లో చాలా సినిమాలు ఇప్పుడు ఫైనల్ స్టేజీలో ఉన్నాయి. షూటింగ్ లకు పర్మిషన్ వస్తే వీలైనంత త్వరగా కంప్లీట్ చేసి వీటిని విడుదలకు సిద్ధం చేయాలని చూస్తున్నారు. అయితే థియేటర్లు తెరుచుకోడాని ఇంకాస్త ఎక్కువ సమయం పడుతుందని అంటున్నారు. ఆగస్ట్ లేదా సెప్టెంబర్ లో థియేటర్స్ రీ ఓపెన్ చేస్తారని అంచనాలు వేస్తున్నారు.

అదే నిజమైతే అప్పటికి చాలా సినిమాలు షూటింగ్ పూర్తి చేసుకుని రెడీగా ఉంటాయి. ఏప్రిల్ - మే - జూన్ - జులై నెలల్లో వాయిదా పడే సినిమాల లిస్ట్ చాలా పెద్దదే ఉంది. అంటే థియేటర్స్ తెరిచే సమయానికి విడుదలకు సిద్ధమయ్యే సినిమాలు చాలా ఉంటాయి. గతేడాది నుంచి రిలీజ్ కోసం ఎదురు చూస్తున్న సినిమాలు ముందుగా షెడ్యుల్ చేసుకోవాలని చూస్తాయి. కాకపోతే 100 శాతం సీటింగ్ ఆక్యుపెన్సీకి అవకాశం లేకపోతే మాత్రం చిన్న మీడియం రేంజ్ సినిమాలు రిలీజ్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి.

ప్రేక్షకుల నుంచి థియేటర్లలో రిలీజ్ అయ్యే సినిమాలకు వచ్చే రెస్పాన్స్ ని బట్టి మరికొన్ని సినిమాలు క్యూ కట్టే అవకాశం ఉంది. ఇదే జరిగితే రిలీజ్ డేట్ల పై పోటీపడి కర్చీఫ్ వేసే పరిస్థితి మళ్ళీ వస్తుంది. లాస్ట్ ఇయర్ కూడా కరోనా లాక్ డౌన్ కారణంగా పోస్ట్ పోన్ అయిన సినిమాలన్నీ స్లాట్స్ కోసం కొట్టుకున్నాయి. ఎప్పుడూ లేని విధంగా ప్రతివారం నాలుగైదు సినిమాలు ప్రేక్షకుల ముందుకు వచ్చాయి. జనవరి నుంచి ఏప్రిల్ రెండో వారం వరకు ఒక ఏడాదికి సరిపడా సినిమాలు విడుదలయ్యాయి. దీంతో కొన్ని చిత్రాలకు టాక్ బాగున్నా రెవెన్యూ రాబట్టలేకపోయాయి. పోటీ తక్కువగా ఉంటే అవన్నీ మంచి కలెక్షన్స్ వసూలు చేసేవి.

ఇప్పుడు మళ్ళీ అలాంటి పరిస్థితి పునరావృతం అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. పెద్ద సినిమాలు ఎలాగూ ఫెస్టివల్ సీజన్స్ ని క్యాష్ చేసుకోడానికి ట్రై చేస్తాయి. దీని వల్ల మిగతా సినిమాలన్నీ వాటికి కొంత సమయం ఇచ్చి రిలీజ్ చేసుకోవాల్సి ఉంటుంది. అందులోనూ ఫైనాన్షియల్ బర్డన్ తప్పించుకోవడానికి వీలైనంత త్వరగా థియేటర్స్ లో విడుదల చేసుకోవాల్సి వస్తుంది. రిలీజ్ డేట్స్ కోసం పెద్ద సినిమాలతో పోటీ పడలేని సినిమాలు.. చిన్న సినిమాలకు ఓటీటీ వేదికలే శరణ్యం అవుతాయి. మరి రాబోయే రోజుల్లో పరిస్థితులు ఎలా ఉంటాయో చూడాలి.