Begin typing your search above and press return to search.
దాసరి వర్ధంతి.. శిష్యులు మరిచారా?
By: Tupaki Desk | 30 May 2019 4:06 PM ISTదర్శకరత్న డా.దాసరి నారాయణరావు స్వర్గస్తులై నేటికి రెండేళ్లయ్యింది. 4 మే 1947 అంటే స్వాతంత్య్రం వచ్చిన సంవత్సరంలో ఆయన జన్మించారు. 30 మే 2017న (70 వయసు) మరణించారు. మే 4న దాసరి జయంతి సందర్భంగా ఆయన శిష్యులు పలు అవార్డు కార్యక్రమాలు సహా లఘు చిత్రాల కాంపిటీషన్ పేరుతో కొంత మేర హడావుడి చేశారు. అయితే నేడు దాసరి వర్థంతి సంగతిని మాత్రం పూర్తిగా మర్చినట్టే అనిపిస్తోంది.
పాలకొల్లులో ఆయన విగ్రహం చెంత అభిమానుల పేరుతో చిన్నపాటి హడావుడి కనిపించినా హైదరాబాద్ పరిశ్రమలో పెద్దంత సందడి కనిపించలేదు. ఇక ఆయన శిష్యుల నుంచి కూడా ఎలాంటి హడావుడి లేనేలేదు. కాలంతో పాటే మరపు అని అంటారు. మరి అలాంటి మరపు లో ఉన్నారా అంతా? అన్న సందేహాలొస్తున్నాయి.
దాసరి మరణానంతరం పరిశ్రమ పెద్ద దిక్కు కోల్పోయింది. ఇప్పటికీ ఆ బ్లాంక్ ఫిల్ కాలేదు. రకరకాల ఎపిసోడ్స్ లో టాలీవుడ్ పరువు పోయిందే కానీ.. దానిని ఆపే నాధుడే లేకుండా పోయారు. పలువురు సినీపెద్దలు ఉన్నా.. కార్మికుల సమస్యల్ని పట్టించుకునేవాళ్లు జీరో. అందుకే దాసరి ఇప్పటికీ యూనిక్ పర్సనాలిటీ అన్న గౌరవం కార్మిక వర్గాల్లో అలానే ఉంది. పోయినా ఆయనే రారాజు. ఇకపోతే దాసరి బయోపిక్ తీస్తున్నాం! అంటూ బోలెడంత హడావుడి చేశారు. కానీ ఇంతవరకూ పెద్దాయన బయోపిక్ కి సంబంధించిన ఎలాంటి సమాచారం లేదు.
కత్తి కాంతారావు బయోపిక్ తీస్తున్న పీసీ ఆదిత్య దాసరి బయోపిక్ తీస్తారని వార్తలొచ్చాయి. కానీ ఆయన్నుంచి ఎలాంటి సమాచారం రాలేదు. నిర్మాత సి.కళ్యాణ్ సైతం దాసరి బయోపిక్ ని నిర్మిస్తామని అన్నారు. అక్కడి నుంచి అప్ డేట్ లేదు. మరి మునుముందు శిష్యుల్లో ఎవరైనా అలాంటి ప్రయత్నం చేస్తారా? బయోపిక్ లకు బ్యాడ్ టైమ్ నడుస్తున్న నేపథ్యంలో విరమించుకున్నారా? అన్నది తెలియాల్సి ఉంది. ఇక సినీప్రముఖుల జయంతి అంటే మీడియాలో బోలెడంత హడావుడి ఉంటుంది. కానీ అది కాస్త తగ్గినట్టే కనిపిస్తోంది. దర్శకరత్న దాసరి తొలిగా జర్నలిస్టుగా ప్రస్థానం సాగించిన విషయాన్ని... ఉదయం పత్రికను నడిపించిన సంగతిని మరిచారంతా.