Begin typing your search above and press return to search.

క‌రోనా వ‌స్తే ఇలానే అవుతారా?

By:  Tupaki Desk   |   1 April 2020 6:00 AM GMT
క‌రోనా వ‌స్తే ఇలానే అవుతారా?
X
క‌రోనా మ‌హ‌మ్మారీ ప్ర‌పంచాన్ని షేక్ చేస్తున్న ఈ స‌మ‌యంలో ప‌లువురు క‌థానాయిక‌లు ఫోటోషూట్లతో కాలం వెల్ల‌దీస్తున్న సంగ‌తి తెలిసిందే. ఓవైపు క‌థ‌లు విని దర్శ‌కుల్ని ఫైన‌ల్ చేయ‌డం .. మ‌రోవైపు ఫోటోషూట్లు చేసి వాటిని సోష‌ల్ మీడియాల్లో ఫ్యాన్స్ కి షేర్ చేయ‌డం ఇవే వ్యాప‌కాలుగా సాగుతున్నాయి. ఆ కోవ‌లోనే అంతా మ‌ర్చిపోయిన ఇండోవెస్ట్ర‌న్ బ్యూటీ న‌ర్గీస్ ఫ‌క్రీ కూడా టచ్ లోకి వ‌చ్చింది.

ఈ అమ్మ‌డికి ఇటీవ‌లి కాలంలో బాలీవుడ్ లో అస‌లు ఛాన్సులే లేవు. దీంతో విదేశాల‌కు వెళ్లి సెటిలైపోయింది అంటూ ప్ర‌చారమైంది. ఇక‌పోతే ప్ర‌స్తుతం క‌రోనా లాక్ డౌన్ కార‌ణంగా న‌ర్గీస్ కూడా స్వీయ నిర్భంధంలోకి వెళ్లిపోయింది. అక్క‌డ ఖాళీ చిక్కితే ఏం చేసిందో తెలుసా? ఇదిగో ఇలా మేక‌ప్ పై ప్ర‌యోగాలు చేసింది. హెయిర్ స్టైల్స్ పై డిఫ‌రెంటుగా ట్రై చేస్తోంది. ఆ త‌ల వెంట్రుక‌ల‌కు పింక్ బ్లూ నాచు రంగుల‌ను మిక్స్ చేసి వెస్ట్ర‌న్ పాప్ స్టార్ లా క‌నిపిస్తోంది క‌దూ? ఇదిగో ఎలాంటి ఎక్స్ ప్రెష‌న్స్ ఇస్తోందో చూశారు క‌దా? ఇది ఒరిజిన‌ల్ హెయిరేనా? అంటే.. ప్చ్ కానే కాదు. ఇది విగ్గు.

ప్ర‌స్తుతానికి నిర్భంధ‌న స‌మ‌యాన్ని ఇలా స‌ద్వినియోగం చేస్తోంద‌ట‌. మొన్న‌టివ‌ర‌కూ వంట చేసి విసిగిపోయింది. ఇప్పుడు ఇలా మేకప్ ప‌రంగా ప్రయోగాలు చేసింది. అంతేకాదు ఈ విగ్గు ఎలా ఉంది? నా హెయిర్ రంగులు ఎలా ఉన్నాయి? అని ప్ర‌శ్నిస్తూ సోష‌ల్ మీడియాల్లో ఈ ఫోటోల్ని షేర్ చేయ‌డంతో అవి కాస్తా వైర‌ల్ గా మారాయి. వీటిపై త‌న‌ అభిమానుల అభిప్రాయాన్ని న‌ర్గీస్ కోరింది. ఇన్ స్టాలో ఓ వీడియో స‌హా కొన్ని ఫోటోల్ని పంచుకుంది. అక్కడ ర‌క‌ర‌కాల‌ రంగులు అద్దిన‌ విగ్ వెరైటీగా ఆక‌ర్షించింది.

``ఈ రోజు నేను వంటలో విసుగు చెందాను కాబట్టి మేకప్ ట్రై చేసాను. నేను మేకప్ ఆర్టిస్ట్ ను కాదు. కానీ నేను అనుక‌రించ‌గ‌ల‌ను. మీరు ఏమనుకుంటున్నారో చెప్పండి?`` అని అడిగింది. ఇక ఈ ఫోటోల‌కు అభిమానుల నుంచి ర‌క‌ర‌కాల కామెంట్లు వినిపిస్తున్నాయి. డిస్నీ యువరాణికి తక్కువేం కాదు అని కొంద‌రు పొగిడేస్తుంటే కొంద‌రు ఫ్యాన్స్ మాత్రం క‌రోనా వ‌స్తే ఇలా అవుతుందా? అంటూ వ్యంగ్యంగా సెటైర్లు వేస్తున్నారు. 2019లో స‌చిన్ జోషి స‌ర‌స‌న అమ‌వాస్ అనే చిత్రంలో న‌టించింది. ఆ సినిమా ఫ్లాపైంది. ఇటీవ‌ల‌ గిరీష్ మాలిక్ ద‌ర్శ‌క‌త్వంలో తోర్ బాజ్ అనే చిత్రంలో న‌టించింది. ఇందులో సంజ‌య్ ద‌త్ ఆర్మీ అధికారిగా న‌టించారు. ఈ యాక్ష‌న్ చిత్రం రిలీజ్ సంగ‌తి తెలియాల్సి ఉంది.