Begin typing your search above and press return to search.
హీరోగా కమెడియన్ సప్తగిరి మరో కమర్షియల్ సక్సెస్ అందుకునేనా..?
By: Tupaki Desk | 26 Jun 2021 3:00 PM ISTహాస్యనటుడిగా తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న సప్తగిరి.. ఈ క్రమంలో హీరోగా మారిన సంగతి తెలిసిందే. హీరోగా 'సప్తగిరి ఎక్స్‌ప్రెస్' 'సప్తగిరి ఎల్ఎల్‌బి' 'వజ్రకవచధర గోవింద' వంటి సినిమాల్లో నటించాడు. ఒకవైపు కామెడీ రోల్స్ చేస్తూనే మరోవైపు అవకాశం వచ్చినప్పుడు హీరోగా నటిస్తున్నాడు. 'ఏక్ మినీ కథ' సినిమాతో కమెడియన్ గా మళ్లీ ఫామ్ లోకి వచ్చిన సప్తగిరి.. 'హౌస్ అరెస్ట్' అనే సినిమాలో కీలక పాత్ర పోషిస్తున్నాడు. అలానే 'ఎయిట్' అనే త్రిభాషా ఇల్యూజన్ థ్రిల్లర్ లో హీరోగా నటిస్తున్నాడు. ఈ క్రమంలో సప్తగిరి ఓ కమర్షియల్ సినిమా చేస్తున్నాడు.
ఇందులో సప్తగిరి హీరోగా నటిస్తే.. ప్రముఖ సంగీత దర్శకుడు, సింగర్ రఘు కుంచె నెగిటివ్ రోల్ లో కనిపించబోతున్నాడు. '90ఎమ్ఎల్' మూవీతో హీరోయిన్ గా పరిచయమైన నేహా సోలంకి ఈ సినిమాలో సప్తగిరి సరసన హీరోయిన్ గా నటిస్తోంది. కె.ఎం.కుమార్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని ఎస్ఆర్ఆర్ ప్రొడక్షన్స్ నిర్మిస్తోంది. ఈ సినిమా ఇప్పటికే షూటింగ్ ముగించుకొని పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు జరుపుకుంటోంది. త్వరలో ఈ సినిమా టైటిల్ - ఫస్ట్ లుక్ ను విడుదల చేయనున్నారు. మరి హీరోగా సప్తగిరి ఈ సినిమాతో మరో కమర్షియల్ సక్సెస్ అందుకుంటాడేమో చూడాలి.