Begin typing your search above and press return to search.

చిరు చెప్పినంత మాత్రాన చరణ్ చేసేస్తాడా?

By:  Tupaki Desk   |   20 Jan 2023 12:30 PM GMT
చిరు చెప్పినంత మాత్రాన చరణ్ చేసేస్తాడా?
X
పూరి జగన్నాథ్ పరిస్థితి ఇప్పుడు అగమ్యగోచరంగా తయారైంది. ఇస్మార్ట్‌ శంకర్ సినిమాతో సూపర్ హిట్ అందుకుని తర్వాత లైగర్ సినిమాతో మరో బంపర్ అందుకుందామని ప్రయత్నిస్తే... ఆ సినిమా బొక్క బోర్లా పడేలా చేసింది. ప్రస్తుతానికి పూరి జగన్నాథ్ ఎవరితో సినిమా చేయాలో అర్థం కాక... ఒక రకమైన డిప్రెషన్ మోడ్‌లో ఉన్నారని తెలుస్తోంది. వాస్తవానికి విజయ్ దేవరకొండతోనే ఆయన జనగణమన అనే సినిమా చేయాల్సి ఉంది. కానీ విజయ్ దేవరకొండ లైగర్ సినిమా రిజల్ట్ చూసిన తర్వాత మనం ముందుకు వెళ్లకపోవడమే మంచిది అని భావించి ప్రాజెక్టు నిలిపివేసినట్లు ఆ మధ్య వార్తలు వచ్చాయి.

దీంతో అసలు పూరి జగన్నాథ్ తర్వాతి సినిమా ఎవరితో ఉండబోతుందనేది ఆసక్తికరంగా మారింది. పూరీ జగన్నాథ్‌కి ఇలా ప్లాపులతో ఇబ్బంది పడడం... ఇప్పుడు ఆయనను నమ్మి సినిమా అవకాశం ఇచ్చే హీరో ఎవరున్నారా అని అందరూ ఆలోచిస్తున్నారు. వాస్తవానికి ఇప్పుడు తెలుగులో తప్ప.. కాస్త పేరు ఉన్న మార్కెట్ హీరోలు ఎవ్వరూ ఖాళీగా లేరు. అయితే పూరీ జగన్నాథ్ మాత్రం తన ప్రయత్నాలు తాను చేసుకుంటూ మెగాస్టార్ చిరంజీవిని కలిసి ఒక కథ వినిపించినట్లు తెలుస్తోంది.

అయితే అందరూ ఈ కథ చిరంజీవి కోసం అనుకున్నారు. కానీ అది రామ్ చరణ్ కోసం పూరీ జగన్నాథ్ రాసుకున్న కథ అని తెలుస్తోంది. నేరుగా రామ్ చరణ్‌ని కలవడం ఇప్పటిలో పాజిబుల్ అయ్యే విషయం కాదు. ఎందుకంటే నిన్న మొన్నటి వరకు రామ్ చరణ్ ఆర్ఆర్ఆర్‌ అవార్డుల కోసం అమెరికా చుట్టి వచ్చారు.

తర్వాత షూటింగ్స్‌లో బిజీ అవుతున్నారు. నేరుగా రామ్ చరణ్ టైం అడిగితే కాదనే అవకాశం కూడా ఉండడంతో చిరంజీవికి కథ చెప్పి... అటు నుంచి నరుక్కు రావాలని ప్రయత్నం చేసినట్లు తెలుస్తోంది.

చిరంజీవి కూడా కథ విని చరణ్ బాబుకు చెబుతానని మాట ఇచ్చారు. కానీ ఖచ్చితంగా సినిమా చేయిస్తా అనే మాటయితే ఇవ్వలేదని తెలుస్తోంది. అయినా చిరంజీవి డెసిషన్లు ఈ మధ్య వరుసగా బోల్తాలు పడిన నేపథ్యంలో ఒకవేళ చిరంజీవి మొహమాటం కొద్ది పూరి జగన్నాధ్‌తో సినిమా చేయమన్నంత మాత్రాన చేస్తాడా అంటే డౌటే.

ఎందుకంటే తనకి సూట్ కాదు అనుకుంటే ప్రకటించిన ప్రాజెక్టులనే చరణ్ పక్కన పెట్టేసిన విషయాన్ని మనం అందరం గమనించాం. గౌతం తిన్ననూరి ప్రాజెక్ట్ ప్రకటించిన తర్వాత తనకు సెట్ కాదు అనుకుని ఆ ప్రాజెక్టు ఆపేశాడు. ఇలాంటి తరుణంలో తండ్రి మొహమాటం కొద్దీ చెబితే అది నిజంగా చరణ్ పాటిస్తాడా?


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.