Begin typing your search above and press return to search.

భానుమతి సినిమాలు చేయకుంటే పెళ్లి చేస్తారా?

By:  Tupaki Desk   |   2 May 2022 11:30 AM GMT
భానుమతి సినిమాలు చేయకుంటే పెళ్లి చేస్తారా?
X
ఫిదా సినిమా తో తెలుగు ప్రేక్షకులను భానుమతిగా ఫిదా చేసిన సాయి పల్లవి ఒక్కసారిగా టాలీవుడ్‌ లో స్టార్‌ హీరోయిన్ గా మారిపోయింది. కేవలం టాలీవుడ్‌ లోనే కాకుండా తమిళ ఇండస్ట్రీలో కూడా సాయి పల్లవి స్టార్‌ డమ్‌ అమాంతం పెరిగి పోయింది. ఇక మలయాళం గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఇదే సమయంలో హిందీ ప్రేక్షకులను కూడా సాయి పల్లవి పలకరించి ఆకట్టుకుంది.

ఇన్ని భాషల్లో సినిమాలు చేస్తున్న సాయి పల్లవి ఒక్కసారిగా సైలెంట్‌ అవ్వడంతో అందరిలో పలు అనుమానాలు వస్తున్నాయి. కోట్లకు కోట్ల పారితోషికాలు ఆఫర్‌ చేసి తమ సినిమాల్లో నటించమని అన్ని భాషల ఫిల్మ్‌ మేకర్స్ ఆఫర్స్ ఇస్తున్నా కూడా సాయి పల్లవి మాత్రం ఈమద్య కాలంలో ఏ ఒక్క సినిమాకు కూడా కమిట్‌ అవుతున్న దాఖలాలు కనిపించడం లేదు. కనీసం అడ్వాన్స్ లు కూడా తీసుకోవడం లేదు.

సాయి పల్లవి సినిమాల విషయంలో కాస్త సైలెంట్‌ గా ఉంది.. కాని సినిమా కార్యక్రమాలు ఏమైనా ఉంటే మాత్రం తప్పకుండా వస్తుంది.. తన వంతు ప్రమోషన్ కార్యక్రమాలు చేస్తుంది వెళ్తుంది. కాని ఆమె కొత్త సినిమాల కమిట్‌ అయ్యే విషయంలో మాత్రం గందరగోళంకు గురి చేస్తుంది. ఇమేజ్ ఉన్నప్పుడే నాలుగు సినిమాలు చేస్తే స్టార్‌ డమ్‌ వస్తది.. కోట్ల రూపాయలు వస్తాయి.

ఆ విషయం సాయి పల్లవి పట్టించుకోవడం లేదా.. లేదంటే ఆమెకు డబ్బుపై ఆసక్తి లేదా అనేది అర్థం కావడం లేదు. చిరంజీవి వంటి స్టార్‌ హీరోతో కలిసి నటించే అవకాశం వద్దు అన్నప్పుడు సరే రీమేక్ సినిమాలో చేయవద్దని భావించిందేమో అనుకున్నాం... పవన్‌ కళ్యాణ్ సినిమాలో చేయమని అడిగినప్పుడు చిన్న పాత్ర అని వదిలేసింది అనుకున్నాం. కాని ఇప్పుడు ఆమె అసలు సినిమాలే చేయడం లేదు ఎందుకు అంటూ అభిమానులు మదన పడుతున్నారు.

ఆమె ఒక వైపు సినిమాలు చేయడం లేదని అభిమానులు ఆందోళన చెందుతుంటే మరో వైపు కొన్ని మీడియాల్లో సాయి పల్లవి పెళ్లి అంటూ కథనాలు అల్లేస్తున్నారు. ముఖ్యంగా తమిళ మీడియాల్లో ఈ విషయమై ప్రముఖంగా కథనాలు వస్తున్నాయి. సాయి పల్లవి పెళ్లి ఫిక్స్.. ఆమె త్వరలోనే పెళ్లి పీఠలు ఎక్కబోతుందని వార్తలు రాస్తున్నారు. అయితే ఇప్పటి వరకు అవి గాలి వార్తలుగానే నిలుస్తున్నాయి. ఎందుకంటే ఎలాంటి క్లారిటీ.. అధికారిక ప్రటన మాత్రం రాలేదు.

ఆ వార్తలపై సాయి పల్లవి అభిమానులు అసహనం వ్యక్తం చేస్తూ.. సినిమాలు చేయకుంటే పెళ్లి చేసుకోబోతుందని వార్తలు అల్లేస్తున్నారు అంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. సాయి పల్లవి ఇప్పట్లో పెళ్లి చేసుకోదు అంటూ అభిమానులు నమ్మకంగా ఉన్నారు. మరి ఆ నమ్మకంను సాయి పల్లవి ఎంత వరకు నిలుపుతుంది.. మళ్లీ ఆమె ఎప్పుడు నటిస్తుంది అనేది చూడాలి.