Begin typing your search above and press return to search.

అవ‌తార్ రీరిలీజ్ వెన‌క మాస్ట‌ర్ ప్లాన్ ఇదే!

By:  Tupaki Desk   |   1 April 2020 7:00 AM IST
అవ‌తార్ రీరిలీజ్ వెన‌క మాస్ట‌ర్ ప్లాన్ ఇదే!
X
నిన్న గాక మొన్న అవ‌తార్ చిత్రాన్ని రీరిలీజ్ చేస్తున్నాం అంటూ డిస్నీ సంస్థ ప్ర‌తినిధుల నుంచి ప్ర‌క‌ట‌న రావ‌డం ఆశ్చ‌ర్య‌ప‌రిచింది. ఓవైపు కొవిడ్ 19 ప్ర‌పంచాన్ని చుట్ట‌బెట్టేస్తుంటే వీళ్ల రీరిలీజ్ గొడ‌వేంటి? అన్న చ‌ర్చ సాగింది. అందునో క‌రోనా జ‌న్మ‌ స్థాన‌మైన చైనాలో అవ‌తార్ చిత్రాన్ని ప్ర‌స్తుతం రీరిలీజ్ చేసేందుకు స‌న్నాహాలు సాగుతున్నాయి. అయితే ఇలా రిలీజ్ చేయ‌డ‌నికి కార‌ణం ఎంసీయు మూవీ `అవెంజ‌ర్స్ - ఎండ్ గేమ్` రికార్డుల్ని వెంటాడే ఛాన్స్ కోస‌మేనంటూ ప్ర‌చార‌మైంది. అయితే అవ‌తార్ కి పోటీగా మ‌రోసారి ఎండ్ గేమ్ ని రిలీజ్ చేసే ఛాన్సుంద‌న్న వాద‌నా వినిపించింది.

అదంతా స‌రే కానీ... హాలీవుడ్ లో ఎంసీయూతో పోటీప‌డే ప్ర‌త్య‌ర్థులు ర‌క‌ర‌కాల రికార్డుల కోసం జిమ్మిక్కులు చేస్తూనే ఉంటార‌న్నది అంద‌రికీ తెలిసిన స‌త్యం. అదే త‌ర‌హాలో త‌దుప‌రి రిలీజ్ కి రెడీ అవుతున్న అవ‌తార్ 2 పైనా ఆస‌క్తిక‌ర చ‌ర్చ సాగుతోంది. ఇక ఇప్ప‌టి నుంచే జేమ్స్ కామెరూన్ అవ‌తార్ 2 కి ప్ర‌చారం చేయాల‌న్న ప‌ట్టుద‌ల‌తో ఉన్నాడ‌ట‌. ఆ క్ర‌మంలోనే అవ‌తార్ ని రీరిలీజ్ చేయ‌డం ద్వారా ఆ ఫీవ‌ర్ ని రాజేయ‌ద‌లిచారా? అన్న చ‌ర్చా మొద‌లైంది. అవ‌తార్ నుంచి రాబోతున్న రెండు సినిమాల‌కు ఇంకా చాలా స‌మ‌య‌మే ఉంది. అవతార్ 2 విడుదల తేదీ 17 డిసెంబర్ 2021 అంటూ ఇదివ‌ర‌కూ ప్ర‌క‌టించారు. అటుపై అవతార్ 3 చిత్రం 2023 డిసెంబర్ 22న విడుద‌ల‌వుతుంద‌ని ప్ర‌క‌టించారు.

ఇక అవ‌తార్ రికార్డుల్ని కొట్టేందుకు దాదాపు ప‌దేళ్లు పైగానే ప‌ట్టింది అవెంజ‌ర్స్ - ఎండ్ గేమ్ కి. ఈ ఫ్రాంఛైజీలో ఎండింగ్ మూవీ కాబ‌ట్టి ఎండ్ గేమ్ పై సెంటిమెంట్ వ‌ర్క‌వుట్ అయ్యింద‌న్న విశ్లేష‌ణ‌లు సాగాయి. ఇక ఇంత‌కుముందు డిస్నీ ప్ల‌స్ స్ట్రీమింగ్ సంస్థ‌ జేమ్స్ కామెరాన్ అవతార్ ను కొనేందుకు తొలుత నిరాకరించింది. దానికి కార‌ణం డిస్నీ ప్ల‌స్ స్ట్రీమింగ్ సేవ అనేది హౌస్ ఆఫ్ మౌస్ కోసం నిర్ధేశించిన‌ది. ఫాక్స్ సంస్థ‌లో తెర‌కెక్కే చలనచిత్రాలు.. వాటితో పాటే ఫాక్స్ టీవీ సామ్రాజ్యంలో ఎక్కువ భాగం డిస్నీ కొనుగోలు చేయడానికి డిస్నీ ఆస‌క్తి చూపిస్తుంది. ఫాక్స్ ప్రొడ‌క్ట్ ని ఒక లైబ్ర‌రీలా భావిస్తుంది డిస్నీ. వినోద పరిశ్రమ రూపాంతరం చెందుతున్న ప్ర‌స్తుత‌ సమయంలో పోటీగా నిలిచేందుకు డిస్నీ ఎత్తుగ‌డ అది. స్ట్రీమింగ్ రైట్స్ లో పోటీలో నెగ్గే వ్యూహ‌మిది.

జేమ్స్ కామెరాన్ అవతార్ ఫ్రాంచైజీని డిస్నీ కొనుగోలు చేశాక‌.. దానిని త‌మ కీర్తి కిరీటంలో జెమ్ అంటూ అభివర్ణించేశారు. ఈ రికార్డ్-బ్రేకింగ్ మూవీ ప్రపంచ బాక్సాఫీస్ వ‌ద్ద‌ అత్యధిక వసూళ్లు చేసింది. అటుపై ఎవెంజర్స్: ఎండ్‌ గేమ్ రిలీజైంది. ఇక చాలా కాలంగా ప‌దిలంగా ఉన్న అవ‌తార్ రికార్డుల్ని కొట్టేందుకు చాలా ఏళ్లు ప‌ట్టింది. అందుకే ఇప్పుడు డిస్నీ ప్ల‌స్ అవ‌తార్ 2 స‌హా అవ‌తార్ సీక్వెల్స్ అన్నిటినీ కొనుగోలు చేయ‌నుంద‌ట‌. అవ‌తార్ సీక్వెల్స్ మంచి వ‌సూళ్లు సాధిస్తాయ‌ని.. అవ‌తార్ ల‌ కొత్త థీమ్ పార్కులను ప్రారంభించడంతో డిస్నీ చాలా సమయం కేటాయించాలని భావిస్తోంది. యూనివర్సల్ లో పోటీపడుతున్న విజార్డింగ్ వరల్డ్ ఫ్రాంచైజీకి అవతార్ పార్కులు దాని సమాధానం అని కంపెనీ అభిప్రాయపడింది. ఇక ఈ ప‌నుల‌తో అవ‌తార్ 2 పై హైప్ పెంచేందుకు ప్లాన్ చేస్తున్నార‌ట‌.