Begin typing your search above and press return to search.

ఆ హీరో సరసన అనుపమ 'పెయిర్' క్లిక్ అవుతుందా??

By:  Tupaki Desk   |   29 May 2021 4:30 PM GMT
ఆ హీరో సరసన అనుపమ పెయిర్ క్లిక్ అవుతుందా??
X
సినీ ఇండస్ట్రీలో కొందరు హీరోలు హీరోయిన్స్ కలిసి నటించిన సినిమాలు హిట్ అయ్యాయంటే ఖచ్చితంగా ఆ జంటను లక్కీ పెయిర్ అంటుంటారు ఫ్యాన్స్. అలాగే మరోసారి వారిద్దరూ కలిసి సినిమాలు చేస్తే బాగుంటుందని కోరుకుంటారు. కానీ అన్నిసార్లు ఆ జంటను మాత్రమే చూడాలంటే కొందరికి నచ్చుతుంది. మరికొందరికి బోర్ ఫీలింగ్ కలగవచ్చు. అయితే కొన్ని జంటలు ఎన్ని సినిమాలు చేసినా ప్రేక్షకులు ఆదరించారంటే ఖచ్చితంగా హిట్ పెయిర్ అనే పేరు పడిపోతుంది. అలాగే ఆ హీరోకు ఆ హీరోయిన్ ఉంటేనే లక్ అనే టాక్ కూడా వినిపిస్తుంది. టాలీవుడ్ ఇండస్ట్రీలో అలాంటి లక్కీ పెయిర్స్ చాలానే ఉన్నాయి. అందులో ఒకటిగా పాపులర్ అయింది యంగ్ హీరో నిఖిల్ - కలర్ స్వాతి జంట.

వీరిద్దరూ కలిసి ఇదివరకు స్వామిరారా - కార్తికేయ సినిమాలు చేశారు. రెండు కూడా బాక్సాఫీస్ వద్ద సూపర్ హిట్స్ గా నిలిచాయి. మొదటి నుండి డిఫరెంట్ కాన్సెప్ట్ లతో ముందుకెళ్తున్నాడు హీరో నిఖిల్. అయితే కలర్ స్వాతితో సినిమాలు వరుసగా బ్యాక్ టు బ్యాక్ హిట్స్ పడేసరికి ఫ్యాన్స్ కూడా లక్కీ పెయిర్ అనేసారు. కానీ ఇప్పుడు కలర్ స్వాతి యాక్టింగ్ ఆపేసి పెళ్లి చేసుకొని హ్యాపీగా విదేశాల్లో సెటిల్ అయిపోయింది. ఆ విషయం పక్కన పెడితే.. హీరో నిఖిల్ ప్రస్తుతం రెండు సినిమాలు లైన్ లో పెట్టేసాడు. చివరిగా విడుదలైన 'అర్జున్ సురవరం' హిట్ అవ్వడంతో నిఖిల్ మంచి జోష్ లోకి వచ్చాడు. ప్రస్తుతం చందు మొండేటి దర్శకత్వంలో తెరకెక్కుతున్న కార్తికేయ సీక్వెల్ చేస్తూనే మరోవైపు పల్నాటి సూర్యప్రతాప్ దర్శకత్వంలో 18పేజెస్ అనే సినిమా చేస్తున్నాడు.

అయితే ఇందులో కార్తికేయ-2 థ్రిల్లర్ మూవీ కాగా 18పేజెస్ రొమాంటిక్ లవ్ స్టోరీ. ఈ రెండు సినిమాల్లో నిఖిల్ సరసన కుర్రభామ అనుపమ పరమేశ్వరన్ హీరోయిన్ గా నటిస్తోంది. మరి ఒకే హీరోయిన్ తో బ్యాక్ టు బ్యాక్ రెండు సినిమాలంటే ఖచ్చితంగా ఫ్యాన్స్ లో ఎక్సపెక్టషన్స్ హై లెవెల్లో ఉంటాయి. అందులోను సూపర్ ఫ్యాన్ ఫాలోయింగ్ కలిగిన అనుపమ పరమేశ్వరన్ అంటే ఇంకా చెప్పక్కర్లేదు. అయితే కలర్ స్వాతి - నిఖిల్ కాంబినేషన్ లాగే అనుపమ - నిఖిల్ కాంబినేషన్ క్లిక్ అవుతుందా లేదా అని ప్రస్తుతం ఇండస్ట్రీలో చర్చలు నడుస్తున్నాయి. చూడాలి మరి నిఖిల్ కెరీర్ కు అనుపమ ప్లస్ అవుతుందేమో. ఇదిలా ఉండగా.. 18పేజెస్ సినిమాకు కథ - స్క్రీన్ ప్లేను స్టార్ డైరెక్టర్ సుకుమార్ అందించడం విశేషం. ఆయన శిష్యుడే సూర్యప్రతాప్ దర్శకత్వం వహిస్తున్నాడు. ఇదివరకు సూర్యప్రతాప్ కరెంట్ - కుమారి21ఎఫ్ సినిమాలు తెరకెక్కించాడు. అలాగే నిఖిల్ - చందు మొండేటి కాంబినేషన్ లో ఇది సెకండ్ మూవీ. అయితే జూన్ 1న 18పేజెస్ ఫస్ట్ లుక్ రిలీజ్ చేయనున్నారు మేకర్స్. ఆ తర్వాత మరో 15 రోజుల్లోనే కార్తికేయ సీక్వెల్ ఫస్ట్ లుక్ రిలీజ్ చేస్తారని సమాచారం.