Begin typing your search above and press return to search.

అల్ల‌రోడు సెంటిమెంట్ ని బ్రేక్ చేస్తాడా.. త‌ప్పు రిపీట్ చేస్తాడా?

By:  Tupaki Desk   |   15 Aug 2021 8:00 AM IST
అల్ల‌రోడు సెంటిమెంట్ ని బ్రేక్ చేస్తాడా.. త‌ప్పు రిపీట్ చేస్తాడా?
X
సుదీర్ఘ కెరీర్ లో కామెడీ చిత్రాల‌తో వ‌రుస‌ బ్లాక్ బ‌స్ట‌ర్లు అందుకున్న‌ అల్ల‌రి న‌రేష్ స్పీడ్ ఇటీవ‌ల పూర్తిగా త‌గ్గింది. ఇండ‌స్ట్రీలో శ‌ర‌వేగంగా అర్థ‌శ‌త‌కం పూర్తి చేసిన హీరోగానూ రికార్డ్ అత‌డి పేరిట ఉంది. ఏడాదికి నాలుగైదు సినిమాలు రిలీజ్ చేసిన‌ అల్ల‌రోడి వేగం అనూహ్య కుదుపుల‌తో ఫ్లాపులతో డ‌ల్ అయ్యింది. ఆ క్ర‌మంలోనే త‌న‌ని తాను నిల‌బెట్టుకునేందుకు శ‌త‌విధాలా ప్ర‌య‌త్నిస్తున్నాడు. ఇటీవ‌ల స‌హాయక పాత్ర‌ల్లో న‌టించి మెప్పించాడు.

`మ‌హ‌ర్షి` సినిమాలో స‌హాయ పాత్ర‌లో న‌టించి సెన్సిబుల్ పెర్ఫామెన్స్ తో న‌రేష్ ఈ త‌ర‌హా పాత్ర‌ల‌కు స‌రిపోతార‌ని నిరూపించారు. స‌పోర్టింగ్ రోల్స్ లోనూ త‌న‌దైన ఇన్నోసెంట్ పెర్పామెన్స్ తో మెప్పిస్తార‌ని ప్రూవ్ చేసారు. ఇక అత‌డు న‌టించిన ప్ర‌యోగాత్మ‌క చిత్రం నాంది క్రైసిస్ లోనూ చ‌క్క‌ని విజ‌యం సాధించ‌డం కొంతవ‌ర‌కూ ఊర‌ట‌. ఇటీవ‌ల‌ నరేష్ మ‌ళ్లీ మెయిన్ ట్రాక్ ఎక్కే ప్ర‌య‌త్నాల్లో బిజీగా ఉన్నారని టాక్ వినిపిస్తోంది.

త‌న‌వైన కామెడీ చిత్రాల‌తో ప్రేక్ష‌కుల్ని క‌డుపుబ్బా న‌వ్వించాల‌నే కాన్ఫిడెన్స్ తో ముందుకెళ్తున్నారు. ప్రస్తుతం `స‌భ‌కు న‌మ‌స్కారం` అనే సినిమాలో న‌టిస్తున్నారు. ఇది పొలిటిక‌ల్ సెటైరిక‌ల్ కామెడీ చిత్రం. అయితే ఇది న‌రేష్ న‌టించిన గ‌త చిత్రాన్ని పోలి ఉంటుంద‌ని గుస‌గుస వినిపిస్తోంది. న‌రేష్ కెరీర్ వ‌రుస విజ‌యాల‌తో పీక్స్ లో ఉండ‌గా ఇదే జోన‌ర్ లో `క‌త్తి కాంతారావు` అనే సినిమా చేసి బ్లాక్ బ‌స్ట‌ర్ కొట్టారు. ఈ నేప‌థ్యంలోనే సెంటిమెంట్ గా ఈ జాన‌ర్ ని రిపీట్ చేస్తున్నార‌ని తెలుస్తోంది. అంటే బ్లాక్ బ‌స్ట‌ర్ ఫార్ములాని రిపీట్ చేసి మ‌రో హిట్టు కొట్టాల‌నే తాప‌త్ర‌య‌మే ఇది.

అయితే ఇక్క‌డ‌ మ‌రో డైల‌మా కూడా ఉంది. స‌భ‌కు న‌మ‌స్కారంలో సునీల్ కూడా ఓ హీరోగా న‌టిస్తున్నారు. స్క్రిప్ట్ లో ఆ ఇద్ద‌రు మెయిన్ లీడ్స్ లో క‌నిపించ‌నున్నారు. అయితే గ‌తంలో ఇదే క‌ల‌యిక‌లో `సిల్లీఫెలోస్` తెర‌కెక్కినా ఆ సినిమా ఫ‌లితం తారుమారైన సంగ‌తి తెలిసిందే. అయినా గ‌త‌ ఫ‌లితాల‌తో సంబంధం లేకుండా మ‌రోసారి సునీల్- న‌రేష్ చేతులు క‌లుపుతున్నారు. సునీల్ కూడా కామెడీ ట్రాక్ వ‌దిలి హీరోగా కొన్ని సినిమాలు చేసారు. అది కొంత కాల‌మే సాగింది. ఆ త‌ర్వాత మ‌ళ్లీ సునీల్ స‌పోర్టింగ్ క‌మ్ కామెడీ ట్రాక్ వైపు మ‌ళ్లారు. మ‌రి ఈ కొత్త ప్ర‌య‌త్నం ఇద్ద‌రికీ ఎలాంటి మ‌లుపునిస్తుందో చూడాలి.

కార‌ణాలు ఎలా ఉన్నా! న‌రేష్ ఈ సినిమాపై చాలా ఆశ‌లు పెట్టుకున్నారు. `నాంది` ఇచ్చిన కాన్ఫిడెన్స్ తో న‌రేష్ మ‌రో ప్ర‌య‌త్నం చేస్తున్నారు. అత‌డు మునుప‌టిలా కెరీర్ ప‌రంగా పుంజుకునేందుకు వ‌రుస హిట్లు కొట్టాల్సి ఉంది. రొటీన్ ఫార్ములాటిక్ క‌థాంశాల‌తో కాకుండా ఎమోష‌న‌ల్ డ్రైవ్ తో సాగే కామెడీ జోన‌ర్ తో అత‌డు మ్యాజిక్ చేస్తాడ‌ని అభిమానులు ఆశిస్తున్నారు. అల్ల‌రి న‌రేష్ అంటే ఒక వేవ్. అత‌డు తిరిగి పున‌రుత్తేజం చెందుతాడ‌నే ప‌రిశ్ర‌మ కూడా ఆశిస్తోంది. వ‌రుస విజ‌యాల‌తో అత‌డిలో నూత‌నోత్సాహం చూడాలి.