Begin typing your search above and press return to search.

ఆలియాని రాజ‌మౌళి మాత్ర‌మే కాపాడ‌గ‌ల‌డా?

By:  Tupaki Desk   |   30 Aug 2020 6:30 AM GMT
ఆలియాని రాజ‌మౌళి మాత్ర‌మే కాపాడ‌గ‌ల‌డా?
X
బాలీవుడ్ యంగ్ హీరో సుశాంత్ సింగ్ రాజ్ ‌పుత్‌ అనుమానాస్ప‌ద మృతి త‌రువాత బాలీవుడ్ కేంద్రంగా నెపోటిజ‌మ్ పై పెద్ద ఎత్తున‌ చ‌ర్చ జ‌రుగుతోంది. నెపోటిజ‌మ్ కార‌ణంగానే సుశాంత్ మృతి చెందాడ‌ని దానికి బాలీవుడ్ ‌లో వున్న బంధుప్రీతి ఇన్ సైడ‌ర్స్ ప్ర‌ధాన‌ కార‌ణ‌మ‌ని నెటిజనులు బాలీవుడ్ సెల‌బ్రిటీల‌పై ట్రోలింగ్ చేయ‌డం మొద‌లుపెట్టారు. ముఖ్యంగా ద‌ర్శ‌క‌నిర్మాత‌ మ‌హేష్ భ‌ట్ ముద్దుల త‌న‌య ఆలియా భ‌ట్ ని టార్గెట్ చేయ‌డం చ‌ర్చ‌నీయాంశంగా మారింది.

అలియా భ‌ట్ న‌టించిన తాజా చిత్రం `స‌డ‌క్ 2` కి ఇది తీవ్ర ప‌రిణామంగా మారింది. ఈ మూవీ ట్రైల‌ర్ ‌కి వ‌చ్చిన‌న్ని డిస్ లైకులు ఇంత వ‌ర‌కు ఏ చిత్రాల‌కి రాలేదు. ఈ చిత్రాన్ని సుశాంత్ ఫ్యాన్స్ బాయ్ కాట్ చేశారు. మ‌హేష్ భ‌ట్ దర్శ‌క‌త్వం వ‌హించిన ఈ చిత్రానికి రేటింగ్ ప‌రంగా ఇంత‌ పూర్ ‌గా రాలేదు. కంటెంట్ బాగున్నా ట్రోలింగ్ కార‌ణంగా ఈ చిత్రానికి క్రిటిక్స్ లీస్ట్ రేటింగ్ ఇచ్చారు. ప్ర‌ఖ్యాత‌ ఐఎండీబీలో రేటింగ్ మ‌రీ దారుణం. 1 /10 రేటింగుతో బ్యాడ్ అయిపోయింది. ఈ స‌న్నివేశం చూస్తుంటే ఆలియా భ‌ట్ కెరీర్ పైనా త‌ను న‌టించే సినిమాల‌పైనా దీని ప్ర‌భావం ప‌డ‌నుందా? అన్న చ‌ర్చా సాగుతోంది. దీంతో అలియాని ఈ గండం నుంచి కాపాడే వారే లేరా అని బాలీవుడ్ తో పాటు ఆమె అభిమానుల్లోనూ చ‌ర్చ జ‌రుగుతోంది.

అలియాభ‌ట్ తెలుగులో `ఆర్.ఆర్.ఆర్‌` లాంటి క్రేజీ మూవీలో న‌టి‌స్తున్న విష‌యం తెలిసిందే. రాజ‌మౌళి తెర‌కెక్కిస్తున్న ఈ చిత్ర షూటింగ్ ఇప్ప‌టికే మేజ‌ర్ పార్ట్ పూర్త‌యింది. ఆలియాకు సంబంధించిన కీల‌క షెడ్యూల్ చేయాల్సి వుంది. ఈ నేప‌థ్యంలో ప్ర‌స్తుత ప‌రిస్థితి నుంచి కాపాడేది రాజ‌మౌళి ఒక్క‌డే అనే వాద‌న వినిపిస్తోంది. దీనికి బాలీవుడ్ ‌లో మెజారిటీ వ‌ర్గం అవున‌నే స‌మాధానం చెబుతున్నారు. అయితే ఆలియా ఆర్.ఆర్.ఆర్ నుంచి త‌ప్పుకుంది! అన్న వార్త‌ల న‌డుమ అస‌లేం జ‌రుగుతోంది? అన్న‌దానిపై స‌రైన క్లారిటీ లేదు. ఆలియా ఈ మూవీలో న‌టిస్తే అది త‌న‌కే ప్ల‌స్. రాజ‌మౌళి వ‌ల్ల త‌న‌కు అంటుకున్న నెగెటివ్ షేడ్ ని వ‌దిలించుకునే వీలుంటుంద‌ని .. ఇటు సౌత్ లోనూ వ‌రుస‌గా అవ‌కాశాలు ద‌క్కించుకుని అన్నిటినీ చెరిపేస్తుంద‌ని ఫ్యాన్స్ భావిస్తున్నారు.