Begin typing your search above and press return to search.

అక్కినేని హీరో 'సిక్స్ ప్యాక్' ట్రీట్ ఇస్తాడా..??

By:  Tupaki Desk   |   6 April 2021 8:00 PM IST
అక్కినేని హీరో సిక్స్ ప్యాక్ ట్రీట్ ఇస్తాడా..??
X
సినిమాలలో హీరోలు సిక్స్ ప్యాక్ చూపించడం అనేది ఎప్పటినుండో కంటిన్యూ అవుతున్న విషయం. ఒకప్పుడు హీరోలు సిక్స్ ప్యాక్ చూపించారంటే థ్రిల్ అయ్యేవారు. కానీ ప్రస్తుత జనరేషన్ హీరోలు సిక్స్ ప్యాక్ పెద్దగా థ్రిల్ కలగడం లేదు. ఎందుకంటే సిక్స్ ప్యాక్ అనేది ఈ మధ్యకాలంలో కామన్ అయిపోయింది. కానీ ఇప్పటివరకు సిక్స్ ప్యాక్ చూపించని హీరోలు ధైర్యం చేస్తే మాత్రం థ్రిల్ కలిగే వీలుంది. ప్రస్తుతం అదే ఆలోచనలో ఉన్నాడట యువహీరో అక్కినేని అఖిల్. త్వరలోనే అఖిల్ మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. ప్రస్తుతం ఆ సినిమా తుదిదశలో ఉందట. ఇదిలా ఉండగా.. బ్యాచిలర్ సినిమా తర్వాత అఖిల్ సురేందర్ రెడ్డి దర్శకత్వంలో సినిమా చేయనున్న సంగతి తెలిసిందే.

అనిల్ సుంకర నిర్మాణంలో తెరకెక్కనున్న ఈ పవర్ ఫుల్ యాక్షన్ సినిమా ఏప్రిల్ 7న లాంచనంగా ప్రారంభం కానుంది. ఏప్రిల్ 8న అఖిల్ పుట్టినరోజు ఉండటంతో తన కొత్తసినిమాను ప్రారంభించనున్నాడు. అయితే విషయం ఏంటంటే.. అఖిల్ సురేందర్ రెడ్డి సినిమా కోసం సిక్స్ ప్యాక్ తో దర్శనం ఇవ్వనున్నాడు. దాదాపు 40కోట్ల భారీ బడ్జెట్ తో రూపొందనున్న ఈ సినిమా అనౌన్స్ మెంట్ కోసం ఏప్రిల్ 7న పోస్టర్ రిలీజ్ చేయనున్నారు మేకర్స్. అయితే ఆ పోస్టర్ విడుదలను రెండు విధాలుగా ప్లాన్ చేశారట. ఒకటి షర్ట్ లేకుండా అఖిల్ సిక్స్ ప్యాక్ లో కనిపించడం లేదా ఇంకో విధం. అయితే మేకర్స్ ప్రస్తుతం అఖిల్ సిగ్నల్ కోసం వెయిట్ చేస్తున్నారట. చూడాలి మరి ఈ అక్కినేని హీరో సిక్స్ ప్యాక్ తో ట్రీట్ ఇస్తాడేమో!