Begin typing your search above and press return to search.

హ్యాపీ బర్త్‌ డే అఖిల్‌ : ఈ ఏడాదైనా దక్కేనా?

By:  Tupaki Desk   |   8 April 2020 7:10 AM GMT
హ్యాపీ బర్త్‌ డే అఖిల్‌ : ఈ ఏడాదైనా దక్కేనా?
X
అఖిల్‌ అక్కినేని గతంలో ఏ హీరోకు లేనంత క్రేజ్‌ తో హీరోగా తెలుగు ప్రేక్షకులకు పరిచయం అయ్యాడు. మొదటి సినిమా ‘అఖిల్‌’ భారీ బడ్జెట్‌ తో తెరకెక్కింది. ఆ సినిమా తీవ్రంగా నిరాశ పర్చింది. అదే ఫలితం రెండవ మూడవ సినిమాలకు పునరావృతం అయ్యింది. వరుసగా మూడు సినిమాలు కూడా నిరాశ పర్చినా కూడా అఖిల్‌ పై అక్కినేని ఫ్యాన్స్‌ నమ్మకంగానే ఉన్నారు. ప్రస్తుతం అఖిల్‌ తన నాల్గవ సినిమాను బొమ్మరిల్లు భాస్కర్‌ దర్శకత్వంలో చేస్తున్న విషయం తెల్సిందే.

గీతాఆర్ట్స్‌ 2 బ్యానర్‌ లో అల్లు అరవింద్‌ కాంపౌండ్‌ లో ఈ సినిమా నిర్మాణం జరుగుతుంది. అల్లు అరవింద్‌ అఖిల్‌ ను రీ లాంచ్‌ చేయబోతున్నాడు అంటూ ప్రచారం చేస్తున్నారు. అల్లు అరవింద్‌ ప్రతిష్టాత్మకంగా తీసుకుని ఈ సినిమాను నిర్మిస్తున్నాడు. అక్కినేని అభిమానులకు ఖచ్చితంగా అఖిల్‌ నుండి ఒక మంచి సినిమాను ఇవ్వాలని మెగా కాంపౌండ్‌ తీవ్రంగా ప్రయత్నాలు చేస్తోంది. అఖిల్‌ తాజా చిత్రం మోస్ట్‌ ఎలిజబుల్‌ బ్యాచిలర్‌ చిత్రం షూటింగ్‌ చకచక జరుగుతోంది. పూజా హెగ్డే హీరోయిన్‌ గా నటిస్తున్న ఈ చిత్రం ప్రస్తుతం లాక్‌ డౌన్‌ కారణంగా షూటింగ్‌ ఆగిపోయింది. అన్ని అనుకున్నట్లుగా సజావుగా సాగితే ఈ సమ్మర్‌లో సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చేది.

ఇప్పటికే ఫస్ట్‌ లుక్‌.. ఇంకా ఒక పాట కూడా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. అవి సినిమాపై బజ్‌ ను క్రియేట్‌ చేయడంలో సఫలం కాలేదు. దాంతో నేడు అఖిల్‌ బర్త్‌ డే అవ్వడం వల్ల ఆ సందర్బంగా టీజర్‌ విడుదల చేసి సినిమాకు బజ్‌ క్రియేట్‌ చేస్తారని అక్కినేని ఫ్యాన్స్‌ ఆశించారు. కాని అఖిల్‌ సినిమాకు సంబంధించిన ఎలాంటి అప్‌ డేట్‌ వద్దంటూ దర్శక నిర్మాతలకు చెప్పాడట. ఆ విషయాన్ని స్వయంగా ఆయనే చెప్పుకొచ్చాడు. నేడు బర్త్‌ డే జరుపుకుంటున్న అఖిల్‌ వచ్చే బర్త్‌ డే వరకు అయినా మోస్ట్‌ ఎలిజబుల్‌ బ్యాచిలర్‌ తో సక్సెస్‌ కొట్టి ఉండాలని ఫ్యాన్స్‌ ఆశిస్తున్నారు.