Begin typing your search above and press return to search.

'అఖండ' శ్రీకాంత్ ను విలన్ గా నిలబెడుతుందా?

By:  Tupaki Desk   |   17 April 2021 4:30 PM
అఖండ శ్రీకాంత్ ను విలన్ గా నిలబెడుతుందా?
X
తెలుగు తెరపై సీనియర్ స్టార్ హీరోలు విలన్స్ గా టర్న్ తీసుకుంటున్నారు. ఆ జాబితాలో శ్రీకాంత్ కూడా చేరిపోయాడు. బాలకృష్ణ కథనాయకుడిగా రూపొందుతున్న 'అఖండ' సినిమాలో ఆయన పవర్ఫుల్ ప్ర్రతినాయకుడిగా కనిపించనున్నాడు. విలన్ గా నటించడం శ్రీకాంత్ కి కొత్తకాదు. కెరియర్ ఆరంభంలోనే ఆయన యంగ్ విలన్ గా కనిపించాడు. అలాగే విలన్ తరహా నెగెటివ్ షేడ్స్ పాత్రలను కూడా చేశాడు. కాకపోతే బాలకృష్ణ స్థాయి హీరోతో .. ఈ స్థాయి యాక్షన్ ఎపిసోడ్స్ తో విలన్ గా తలపడే సినిమా మాత్రం ఇదే.

ఈ మధ్య కాలంలో శ్రీకాంత్ కి హీరో వేషాలు తగ్గిపోయాయి .. విలన్ వేషాల వైపు వెళదామని ఆయన అనుకుంటే, హీరోగా అడపా దడపా వేషాలు రావడం మొదలయ్యాయి. దాంతో మళ్లీ ఆయన కొంత గ్యాప్ తీసుకున్నాడు. ఇక ఈ సారి మాత్రం గట్టి నిర్ణయమే తీసుకుని విలన్ గా రంగంలోకి దిగాడు. 'లెజెండ్' సినిమాతో జగపతిబాబును తిరుగులేని విలన్ గా నిలబెట్టిన బోయపాటినే, డిఫరెంట్ గా విలన్ పాత్రను డిజైన్ చేసి, శ్రీకాంత్ ను రంగంలోకి దింపాడు. ఆయన లుక్ ను కూడా ఇంట్రెస్టింగ్ గా మార్చేశాడు.

ప్రస్తుతం ఈ సినిమా షూటింగు 'వికారాబాద్' అడవుల్లో జరుగుతోంది. బాలకృష్ణ - శ్రీకాంత్ కాంబినేషన్లోని యాక్షన్ సన్నివేశాలను అక్కడ చిత్రీకరిస్తున్నారు. మరో 15 రోజుల పాటు అక్కడ షూటింగు జరగనున్నట్టుగా చెబుతున్నారు. ఇప్పుడు చిత్రీకరిస్తున్న యాక్షన్ సీన్ ఈ సినిమాకి హైలైట్ గా నిలుస్తుందని అంటున్నారు. ఈ సినిమా హిట్ అయితే ఇక జగపతిబాబు మాదిరిగానే శ్రీకాంత్ కూడా విలన్ గా బిజీ అయ్యే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి.