Begin typing your search above and press return to search.

ట్రైలర్ టాక్: దేశం కోసం ప్రాణాలను సైతం లెక్కచేయని డేర్ డెవిల్ 'వైల్డ్ డాగ్'

By:  Tupaki Desk   |   12 March 2021 10:47 AM GMT
ట్రైలర్ టాక్: దేశం కోసం ప్రాణాలను సైతం లెక్కచేయని డేర్ డెవిల్ వైల్డ్ డాగ్
X
టాలీవుడ్ కింగ్ అక్కినేని నాగార్జున నటిస్తున్న లేటెస్ట్ యాక్షన్ ఎంటర్టైనర్ ''వైల్డ్ డాగ్''. అహిషోర్ సాల్మోన్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని మాట్నీ ఎంటర్‌టైన్మెంట్స్ బ్యానర్‌ పై నిరంజన్ రెడ్డి - అన్వేష్ రెడ్డి నిర్మిస్తున్నారు. సమ్మర్ కానుకగా ఏప్రిల్ 2న ఈ సినిమాని థియేటర్స్ లో రిలీజ్ చేయనున్నారు. ఈ నేపథ్యంలో ఇప్పటికే విడుదలైన ప్రమోషనల్ కంటెంట్ సినిమాపై ఆసక్తిని కలిగించింది. ఈ క్రమంలో తాజాగా 'వైల్డ్ డాగ్' ట్రైలర్ ని మెగాస్టార్ చిరంజీవి విడుదల చేసి చిత్ర యూనిట్ కి విషెస్ తెలియజేసారు.

హైద్రాబాద్ లో 2007లో జరిగిన గోకుల్ చాట్ బాంబ్ బ్లాస్ట్ మరియు 2013 దిల్ సుఖ్ నగర్ బాంబు పేలుళ్ల ప్రధాన సూత్రధారులైన టెర్రరిస్టులను పట్టుకోడానికి రంగంలోకి దిగిన ఎన్ఐఏ టీమ్ కథే ఇదని ట్రైలర్ తో అర్థం అవుతోంది. ఇందులో ఎన్కౌంటర్ స్పెషలిస్ట్ విజయ్ వర్మ అలియాస్ వైల్డ్ డాగ్ అనే ఎన్ఐఏ ఏజెంట్ గా నాగ్ కనిపిస్తున్నాడు. నాగార్జునకు జోడీగా దియా మీర్జా నటించింది. నాగ్ కాస్త వయసు మీద పడిన పాత్రలో వైట్ హెయిర్ తో స్టైలిష్ గా కనిపిస్తున్నారు. దేశం కోసం ప్రాణాలను సైతం రిస్క్ లో పెట్టుకునే ఎన్ఐఏ టీమ్ గురించి ఈ చిత్రంలో చూపిస్తున్నారు. కెరీర్ లో ఎన్నో ప్రయోగాత్మక సినిమాలు చేసిన నాగ్ మరోసారి వైద్యమైన సినిమాతో వస్తున్నాడని తెలుస్తోంది.

'వైల్డ్ డాగ్' సినిమాలో యాక్షన్ సీన్స్ మేజర్ రోల్ ప్లే చేయబోతున్నాయని ట్రైలర్ లో తెలుస్తోంది. టెర్రరిస్టులని పట్టుకోడానికి ఎన్ఐఏ టీమ్ ఎలాంటి సాహసాలు చేస్తారో తెలియజేయడానికి రిస్కీ లొకేషన్స్ లో షూట్ చేశారు. దీనికి థమన్ అందించిన బ్యాగ్రౌండ్ మ్యూజిక్.. షానెల్ డియో సినిమాటోగ్రఫీ అదనపు ఆకర్షణగా నిలిచాయి. మొత్తం మీద ఈ యాక్షన్ ప్యాకెడ్ ట్రైలర్ విశేషంగా ఆకట్టుకుంటోంది. ఈ చిత్రానికి శ్రవణ్ కటికనేని ఎడిటింగ్ వర్క్ చేయగా.. డేవిడ్ యాక్షన్ డైరెక్టర్ గా వ్యవహరించారు. మురళి ఎస్వీ ఆర్ట్ డైరెక్టర్ గా బాధ్యతలు నిర్వర్తించారు. ఈ చిత్రంలో సయామీ కేర్ - అతుల్ కులకర్ణి - ఆలీ రెజా - ప్రకాష్ సుదర్శన్ - బిలాల్ హుస్సేన్ తదితరులు ఇతర కీలక పాత్రలు పోషించారు. మరోసారి ప్రయోగాత్మక సినిమాతో వస్తున్న నాగార్జునకు 'వైల్డ్ డాగ్' ఎలాంటి విజయాన్ని అందిస్తుందో చూడాలి.