Begin typing your search above and press return to search.

నాగ్ ‘వైల్డ్ డాగ్’ రిలీజ్ అక్కడేనట..!

By:  Tupaki Desk   |   2 Jan 2021 11:00 PM IST
నాగ్ ‘వైల్డ్ డాగ్’ రిలీజ్ అక్కడేనట..!
X
అక్కినేని నాగార్జున హీరోగా తెరకెక్కిన యాక్షన్ థ్రిల్లర్ ‘వైల్డ్ డాగ్’. ఈ చిత్రం కోసం ఆయన అభిమానులు ఎంతో ఆతృతగా ఎదురుచూస్తున్నారు. నవంబర్ లోనే చిత్రీకరణ పూర్తి చేసుకున్న ఈ మూవీ.. పోస్ట్-ప్రొడక్షన్ వర్క్ కూడా పూర్తయింది. యాక్షన్ ఎంటర్టైనర్ గా రూపొందిన ఈ చిత్రంలో నాగ్ ఎన్కౌంటర్ స్పెషలిస్ట్ విజయ్ వర్మగా కనిపించనున్నారు. బాలీవుడ్ బ్యూటీ సయామీ ఖేర్ ‘రా’ ఏజెంట్ గా కీలక పాత్ర పోషిస్తోంది. మరో అందాల భామ దియా మీర్జా హీరోయిన్ గా నటిస్తోంది.

అయితే.. ఈ మధ్యనే థియేటర్లు తెరుచుకోవడంతో జనవరిలో ఈ సినిమా బిగ్ స్క్రీన్ పై సందడి చేస్తుందని అభిమానులు ఆశపడ్డారు. ఇప్పటికే.. డిసెంబర్ 25న రిలీజైన సాయి ధరమ్ తేజ్ సినిమా థియేటర్లలో సందడి చేస్తోంది. దీంతో తమ హీరో మూవీ సంక్రాంతికి విడుదలవుతుందని ఫ్యాన్స్ భావించారు. కానీ.. 'వైల్డ్ డాగ్' యూనిట్ మాత్రం థియేటర్లో రిలీజ్ చేయకుండా అభిమానులకు షాక్ ఇచ్చింది యూనిట్.

ఈ చిత్రాన్ని నేరుగా ఓటీటీ లోనే విడుదల చేయాలని మూవీ మేకర్స్ నిర్ణయించుకున్నారు. ఇందుకోసం ఓ డేట్ కూడా ఫిక్స్ చేసారు. రిపబ్లిక్ డే సందర్బంగా జనవరి 26న నెట్‌ఫ్లిక్స్ వేదికగా ఈ సినిమాను విడుదల చేయనున్నారు.

వాస్తవానికి ఈ సినిమా ఎప్పుడో మొదలైంది. లాక్ డౌన్ ఎత్తేసిన తర్వాత చిత్రం షూటింగ్ కంప్లీట్ చేసుకుంది. ఆ తర్వాత కూడా ఎలా రిలీజ్ చేయాలనే విషయమై యూనిట్ తర్జనభర్జనలు పడింది. సంక్రాంతికి సినిమాలు ఎక్కువగా ఉండడం.. సమ్మర్ కు పోస్ట్ పోన్ చేసేంత టైం లేదు. అందుకే ఓటీటీ వేదికగా రిలీజ్ చేయాలని నిర్ణయించుకున్నట్టు టాక్.

సంక్రాంతి బరిలో ఇప్పటికే రామ్ ‘రెడ్’, రవితేజ ‘క్రాక్’, బెల్లంకొండ సాయి ‘అల్లుడు అదుర్స్’తోపాటు తమిళ్ హీరో విజయ్ ‘మాస్టర్’ కూడా లైన్లో ఉంది.’ ఇన్ని సినిమాలను ఫేస్ చేసి రిస్క్ ఎందుకు అనుకొని ఓటీటీ బాట పట్టిందట ‘వైల్డ్ డాగ్’. ఈ వార్త అభిమానులను మాత్రం తీవ్ర నిరాశకు గురిచేస్తుందనడంలో సందేహం లేదు. చూడాలి మరి.. ఎలాంటి రిజల్ట్ నమోదు చేస్తుందో?