Begin typing your search above and press return to search.

దిల్‌ రాజుకు చేదోడు వాదోడుగా భార్య తేజస్విని

By:  Tupaki Desk   |   3 Dec 2020 12:00 PM IST
దిల్‌ రాజుకు చేదోడు వాదోడుగా భార్య తేజస్విని
X
ప్రముఖ నిర్మాత దిల్‌ రాజు కథల ఎంపిక విషయంలో ఎంత జాగ్రత్తగా ఉంటాడో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఆయన కథల జడ్జిమెంట్‌ సూపర్‌ అంటూ అంతా అంటూ ఉంటారు. ఒక కథను ఆయన ఏదైనా హీరోకు అనుకుంటే అది నిజంగా ఆ హీరో కోసమే రాశారా అన్నట్లుగా అనిపిస్తుంది. ఎలాంటి కథలు ప్రేక్షకులకు నచ్చుతాయి.. ఎలాంటి హీరోకు ఎలాంటి కథలు నచ్చుతాయి అనే విషయంలో దిల్‌ రాజు చాలా క్లారిటీగా ఉంటాడు. అందుకే ఆయన సక్సెస్‌ రేటు చాలా ఎక్కువ అనేది అందరి మాట. దిల్‌ రాజు ఆఫీస్‌ లో కథా రచయితల టీం చాలా మంది ఉంటారు. ఎంతో మంది కొత్త వారిని పరిచయం చేసిన ఘనత కూడా ఆయనకే దక్కుతుంది. అలాంటి దిల్‌ రాజు భార్య తేజస్వినికి కూడా కథల విషయంలో చాలా పట్టు ఉన్నట్లుగా ఇండస్ట్రీ వర్గాల వారు చెబుతున్నారు.

ఇటీవలే తేజస్విని ఒక యూనిక్‌ స్టోరీ లైన్ ను దిల్‌ రాజుకు చెప్పారట. ఆ లైన్‌ నచ్చడంతో తన వద్ద ఉండే రచయితలకు కథగా డెవలప్‌ చేయాల్సిందిగా చెప్పాడట. ఆ స్టోరీ బాధ్యతను పూర్తిగా తేజస్వినికి దిల్‌ రాజు అప్పగించారనే వార్తలు కూడా వస్తున్నాయి. ఆమె కూడా కథల విషయంలో దిల్‌ రాజుకు చేదోడు వాదోడుగా ఉంటే ఆయన నుండి మరిన్ని మంచి సినిమాలు వస్తాయంటున్నారు. దిల్‌ రాజు సినిమాల నిర్మాణంకే పరిమితం అవ్వకుండా వెబ్‌ సిరీస్ లపై కూడా దృష్టి పెడుతున్నాడు. ఆ బాధ్యతను భార్య తేజస్వినికి అప్పగించే అవకాశం ఉందని అంటున్నారు.