Begin typing your search above and press return to search.

వైఫ్ అఫ్ రామ్ కు భలే రేటు

By:  Tupaki Desk   |   17 Jun 2018 9:23 AM GMT
వైఫ్ అఫ్ రామ్ కు భలే రేటు
X
బుల్లితెర మీద ఎంత సక్సెస్ అయినా వెండితెర విజయం కోసం పట్టువదలని విక్రమార్కుడిలా ప్రయత్నిస్తున్న మంచు లక్మి ఈసారి తన గోల్ రీచ్ అయ్యేలాగే ఉంది. వైఫ్ అఫ్ రామ్ పేరుతో విజయ్ ఎలకంటి దర్శకత్వంలో రూపొందిన మూవీకి మెల్లగా హైప్ పెరుగుతోంది. విడుదల విషయంలో హడావిడి పడి చిక్కులు తెచ్చుకోకుండా చాలా ప్లాన్డ్ గా వెళ్తోంది యూనిట్. విశ్వసనీయ సమాచారం మేరకు వైఫ్ అఫ్ రామ్ హిందీ డబ్బింగ్ శాటిలైట్ హక్కులకు 1 కోటి 56 లక్షలకు డీల్ కుదిరిందట. ఎలా చూసుకున్నా ఇది చాలా మంచి మొత్తం. మంచు లక్ష్మి తప్ప హీరో అంటూ ప్రత్యేకంగా చెప్పుకోవడానికి ఎవరు లేని ఈ మూవీకి ఇది ఊహించని ధరే. ట్రైలర్ రాకముందు వరకు ఈ సినిమా గురించి ప్రేక్షకులకు అంతగా అవగాహన లేదు. కానీ అది రిలీజ్ అయ్యాక మాత్రం కంటెంట్ ఉన్నట్టు ఉందే అనే ఫీలింగ్ అయితే కలిగింది. నార్త్ మన తెలుగు సినిమాల హక్కులకు డిమాండ్ బాగా ఉన్న నేపథ్యంలో అక్కడ ఉన్న ప్రేక్షకులకు బాగా ఇష్టమైన థ్రిల్లర్ జానర్ లోనే వైఫ్ అఫ్ రామ్ రూపొందటం ప్లస్ గా మారింది.

జంటగా వెళ్తున్న తమపై దాడి చేసి భర్తను హత్య చేసిన నేరస్థుల కోసం తనే స్వయంగా నడుం బిగించిన పాత్రల్లో మంచు లక్ష్మి కొత్తగా కనిపిస్తోంది. కథ కూడా గ్రిప్పింగ్ గా చెప్పిన ఫీలింగ్ కలగటంతో మంచు లక్ష్మి హిట్ కొట్టేలా ఉందనే టాక్ మొదలైపోయింది. హిందీ శాటిలైట్ బిజినెస్ ఇక్కడ కూడా హెల్ప్ అవుతుందనే నమ్మకంతో ఉన్నారు దర్శక నిర్మాతలు. నేను సైతం సీజన్ 2ని సక్సెస్ ఫుల్ గా నడిపిస్తున్న లక్ష్మి వైఫ్ అఫ్ రామ్ కనక హిట్ అయితే మరిన్ని ప్రయోగాలతో దూసుకుపోవచ్చు అనే ప్రణాళికలో ఉంది. ప్రియదర్శి ఇన్వెస్టిగేటివ్ ఆఫీసర్ గా నటిస్తుండగా బిగ్ బాస్ 2 షో లో పార్టిసిపెంట్ గా ఉన్న సామ్రాట్ రెడ్డి ఇందులో రామ్ గా కనిపిస్తాడు. అదే మంచు లక్ష్మి భర్తగా. మనది కానీ బాషలోనే కోటిన్నర లాగేసిన వైఫ్ అఫ్ రామ్ తెలుగులో కూడా అంతకు మించిన మొత్తాన్నే శాటిలైట్ రూపంలో రాబట్టుకోవోచ్చు అనే అంచనాలో ఉంది టీమ్. మొత్తానికి సోలో హీరోయిన్ గా ఫస్ట్ సక్సెస్ ని వైఫ్ అఫ్ రామ్ తో కొట్టాలని గట్టిగా ట్రై చేస్తున్న మంచు లక్ష్మి గురి ఈ సారి తప్పేలా లేదు. లెట్ వెయిట్ అండ్ సి.