Begin typing your search above and press return to search.

టీజర్ టాక్: రామ్ భార్య థ్రిల్లర్ చూపిస్తోంది

By:  Tupaki Desk   |   27 April 2018 11:46 AM GMT
టీజర్ టాక్: రామ్ భార్య థ్రిల్లర్ చూపిస్తోంది
X
మంచు ఫ్యామిలకీకి ఈ మధ్య కాలం అంతగా కలిసి రావడం లేదు. అటు హీరోలతో పాటు ఇటు మంచు లక్ష్మికి కూడా షాక్ బాగానే షాక్స్ తగిలాయి. అయితే.. ఇప్పుడు మంచు లక్ష్మి మాత్రం మాంచి స్ట్రాంగ్ కంటెంట్ ఉన్న మూవీతో ఆడియన్స్ ముందుకు రాబోతోంది.

వైఫ్ ఆఫ్ రామ్ అంటూ మంచు లక్ష్మి ఓ మూవీ చేస్తోన్న విషయం తెలిసిందే. ఇప్పుడీ చిత్రానికి టీజర్ ను రిలీజ్ చేశారు. కొన్ని సన్నివేశాలు.. వేళ్ల మీద లెక్క పెట్టే సంఖ్యలోనే పాత్రలను చూపించినా.. టీజర్ మాత్రం చాలా థ్రిల్లింగ్ గా ఉంది. 'రామ్ ను పై నుంచి తోసి చంపేశారు సార్' అంటూ మంచు లక్ష్మి వాయిస్ తో ఈ టీజర్ మొదలవుతుంది. భర్త మరణానికి సంబంధించిన కేసును డీల్ చేసే భార్య పాత్రలో మంచు లక్ష్మి నటించిందనే సంగతి అర్ధమవుతుంది. అయితే.. ఈ మర్డర్ వెనుక ఎవరు ఉన్నారు అనే అంశాన్ని ఇన్వెస్టిగేట్ చేయడానికి ఆమెకు చాలానే కష్టాలు ఎదురవుతాయి.

ఒకటికి రెండు పోలీస్ పాత్రలను చూపించగా.. ఇందులో ఒకటి నెగిటివ్ క్యారెక్టర్ అనే ఫీల్ ను కలిగించారు. ఈ టీజర్ లో ప్రధానంగా చెప్పుకోవాల్సిన హైలైట్.. మంచు లక్ష్మి నటనే. అంతగా తన క్యారెక్టర్ ను నటనలో వేరియేషన్స్ చూపించి మెప్పించింది. అయితే.. టీజర్ లో థీమ్ వరకే చెప్పడంతో.. అప్పుడే ఓ నిర్ణయానికి రాలేం కానీ.. వైఫ్ ఆఫ్ రామ్ పై ఆసక్తి కలిగించడంలో మాత్రం ఈ టీజర్ సక్సెస్ అయింది.


వీడియో కోసం క్లిక్ చేయండి