Begin typing your search above and press return to search.

మహేష్ తో కలిసి ఎంజాయ్ చేసేస్తున్నారు

By:  Tupaki Desk   |   29 March 2017 9:15 AM GMT
మహేష్ తో కలిసి ఎంజాయ్ చేసేస్తున్నారు
X
సినిమా తారలతో కలిసి వర్క్ చేయడం అంటే.. ఎవరికైనా తెగ హుషారు వచ్చేస్తుంది. అదే మహేష్ లాంటి సూపర్ స్టార్ తో కలిసి పని చేస్తూనే ఎంజాయ్ చేసే ఛాన్స్ వచ్చిందంటే.. ఇక వాళ్లకు పండగ ఇంటికి నడిచొచ్చిందనే ఫీలింగ్ కలగడంలో ఆశ్చర్యం లేదు.

ప్రస్తుతం కొంతమంది గ్రాఫిక్ డిజైనర్లు.. విజువల్ ఎఫెక్ట్స్ సూపర్ వైజర్ల పరిస్థితి ఇలాగే ఉంది. మురుగదాస్ దర్శకత్వంలో మహేష్ నటిస్తున్న చిత్రం కోసం.. ఇప్పుడు టీం అంతా వియెత్నాం వెళుతున్నారు. స్పైడర్ అనే టైటిల్ ను పరిశీలిస్తుండగా.. వియెత్నాంలోని హలోంగ్ లోని డ్రాగన్ పార్క్ లో ఓ భారీ ఫైటింగ్ సీక్వెన్స్ ను పిక్చరైజ్ చేయనున్నారు. మొదట ఈ ఫైట్ ను హైద్రాబాద్ లోని వండర్ లా వాటర్ పార్క్ లో తీయాలని భావించారు కానీ.. అనుమతులు లభించలేదు. దీంతో వియెత్నాంకు షూటింగ్ షిఫ్ట్ చేయాల్సి వచ్చింది.

ఈ భారీ యాక్షన్ సీక్వెన్స్ లో మహేష్ తో.. కోలీవుడ్ హీరో భరత్ పోటీ పడుతున్నాడు. ఈ సన్నివేశం కోసం ఫైర్.. వైర్.. సెట్ ఎక్స్ టెన్షన్స్.. ఇలా చాలానే హంగా ఉండనుండగా.. ఈ సీన్ కోసం కొంతమంది వీఎఫ్ఎక్స్ డిజైనర్స్ ను కూడా తమతో పాటు వియెత్నాం.. బ్యాంకాక్ లను చుట్టేసి తీసుకొచ్చారు మహేష్ అండ్ టీం. మహేష్ తో కలిసి ఎంజాయ్ చేయడాన్ని ఇంకా ఎక్కువగా ఎంజాయ్ చేసేస్తున్నారు వారంతా.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/