Begin typing your search above and press return to search.

పొరుగు హీరోల్ని చూసి అయినా నేర్వ‌రా?

By:  Tupaki Desk   |   29 July 2020 11:45 AM IST
పొరుగు హీరోల్ని చూసి అయినా నేర్వ‌రా?
X
స్టార్ హీరోలు ఎక్కువ సినిమాల్లో న‌టించ‌డం లేద‌ని అప్ప‌ట్లో ఆరోప‌ణ‌లొచ్చాయి. ఆ త‌ర్వాత టాలీవుడ్ హీరోలు దూకుడు పెంచారు. వ‌రుసగా స్టార్ హీరోలు సినిమాల్ని ప్ర‌క‌టిస్తూ వేడెక్కించారు. అయితే ఆ దూకుడు అన్నివేళ‌లా ఒకేలా కంటిన్యూ కాలేదు. ప్ర‌స్తుతం కోవిడ్ క్రైసిస్ ని వ‌దిలేస్తే మ‌న హీరోలు అంత స్పీడ్ గా సినిమాల్ని ప్ర‌క‌టిస్తున్న‌దేం లేదు. మ‌హేష్ .. చ‌ర‌ణ్.. ప్ర‌భాస్ .. ఎన్టీఆర్ స‌హా ప‌లువురు అగ్ర క‌థానాయ‌కులు నెమ్మ‌దిగానే సినిమాలు చేస్తున్నారు. పైగా ఎంచుకునేవి పాన్ ఇండియా రేంజు కావ‌డంతో మ‌రీ నెమ్మ‌దిగా షూటింగులు పూర్త‌వుతున్నాయి.

ఇదే వీళ్ల‌కు ఇప్పుడు ముప్పుగా మారింది. కోవిడ్ విజృంభిస్తున్నా ఆర్జీవీ లాంటి వాళ్లు క్రియేటివ్ కంటెంట్ తో దూసుకెళ్లిపోతుంటే స్టార్లు మాత్రం ముసుగేసుకుని క్వారంటైన్ లో కూచోవాల్సిన ధైన్యం నెల‌కొంది. పరిస్థితిని అంచ‌నా వేసి సంద‌ర్భానుసారం కాన్వాసును అయినా మార్చే అల‌వాటు లేదు మ‌న స్టార్ల‌కు.

ఇక ఇరుగు పొరుగున చూస్తే ఇలా లేదు. మ‌ల‌యాళీలు ఎప్పుడూ బిజీనే. కేర‌ళ‌లో షూటింగులు జ‌రుగుతున్నాయి. త‌మిళ‌నాడులో వైర‌స్ అంత‌గా విజృంభిస్తున్నా స్టార్ హీరోలు బ‌య‌ప‌డ‌డం లేదు. వ‌రుస‌గా సినిమాల్ని ప్ర‌క‌టిస్తూ వేడెక్కిస్తున్నారు. హిందీ వాళ్ల త‌ర్వాత తంబీలే ప్ర‌క‌ట‌న‌ల్లో జోరుమీదున్నారు.

అందుకే పొరుగు బాషా స్టార్ హీరోలను చూసి ఐనా మనవాళ్ళు బుద్ది తెచ్చుకోరు అంటూ ఒక సెక్ష‌న్ క్రిటిక్స్ కామెంట్లు విసురుతున్నారు. హిందీ స్టార్ హీరోలు కానీ.. తమిళ్ స్టార్ హీరోలు కానీ లైనప్‌ లో ఎన్ని సినిమాలు ఉన్నాయో అధికారికంగా ప్రకటిస్తునారు. అలానే ఏడాదికి నాలుగు సినిమాలు ఉండేలా చుస్కుంటున్నారు..! నిన్న ధనుష్ పుట్టినరోజుకి ఏకంగా నాలుగు సినిమాలు బర్త్ డే లుక్ లు రిలీజ్ చేశారంట‌నే అర్థం చేసుకోవ‌చ్చు.