Begin typing your search above and press return to search.
దేశానికి అన్నం పెట్టే రైతన్నల ఉద్యమంపై టాలీవుడ్ జనాలు స్పందించరేం..!
By: Tupaki Desk | 9 Dec 2020 11:21 AM ISTకేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన నూతన వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా పంజాబ్, హర్యానా, యూపీ రాష్ర్టాలకు చెందిన రైతాంగం ఉద్యమిస్తున్న విషయం తెలిసిందే. రైతుల ఆదాయం రెట్టింపు చేయడమే లక్ష్యంగా కేంద్రం చెప్పుకొస్తున్న మూడు వ్యవసాయ చట్టాలను దేశంలోని వివిధ రాష్ర్టాల రైతులు తీవ్రంగా వ్యతిరేకిస్తూ పెద్ద ఎత్తున ఉద్యమం చేపడుతున్నారు. దేశ వ్యాప్తంగా బంద్ చేసి కొత్త చట్టాలను వెనక్కు తీసుకోవాల్సిందేనని నిరసన తెలిపారు. దీనికి పలు రాష్ట్ర ప్రభుత్వాలు, రాజకీయ పార్టీలు, సామాజిక కవులు రైతు ఉద్యమానికి మద్దతుగా నిలిచారు. అయితే టాలీవుడ్ ప్రముఖులు ఈ ఉద్యమానికి దూరంగా ఉన్నట్లు కనిపించింది. ఏ స్టార్ హీరో కూడా రైతుల పట్ల సంఘీభావం ప్రకటించకపోవడంపై సోషల్ మీడియాలో నెటిజన్స్ పెద్ద ఎత్తున విమర్శలు గుప్పిస్తున్నారు.
దేశానికి అన్నం పెట్టే రైతన్నలు లక్షల సంఖ్యలో నడిరోడ్లపై చలిలో రోజుల తరబడి ఉద్యమం చేస్తుంటే సెలబ్రిటీలు స్పందించకపోవడం పై ట్విట్టర్ లో ట్రోల్ చేస్తున్నారు. ప్రతి చిన్న విషయానికి ట్విట్టర్, ఇన్స్టాగ్రామ్ లలో పోస్టులు పెట్టే సినీ ప్రముఖులు రైతుల పోరాటాన్ని పట్టించుకోవడం లేదని నెటిజన్స్ కామెంట్స్ చేస్తున్నారు. ప్రకాష్ రాజ్ - కార్తీ వంటి పలువురు నటులు ఈ ఇష్యూ పై ట్వీట్ చేసినట్లు తెలుస్తోంది. కానీ మన తెలుగు హీరోలు మాత్రం దీనిపై స్పందించలేదు. రైతులు పండించే వాళ్ళ సమస్యలపై సినిమాలు తీస్తూ లాభాలు గడించే సినిమా వాళ్ళు మనకు అన్నం పెట్టే రైతులు చేస్తున్న ఉద్యమం పట్ల స్పందించకపోవడం బాధాకరమని కామెంట్స్ చేస్తున్నారు. కేంద్ర ప్రభుత్వంతో ముడిపడిన వ్యవహారం కాబట్టి ఇలాంటి వ్యవహారాల్లో తలదూర్చడం ఎందుకులే అని దూరంగా ఉన్నారేమో అని నెటిజన్స్ అభిప్రాయ పడుతున్నారు.