Begin typing your search above and press return to search.

ఇండస్ట్రీలో ఆ స్టార్ డైరెక్టర్స్ ఎందుకలా..?

By:  Tupaki Desk   |   15 July 2020 9:15 AM IST
ఇండస్ట్రీలో ఆ స్టార్ డైరెక్టర్స్ ఎందుకలా..?
X
టాలీవుడ్ ఇండస్ట్రీలో దర్శకుల శిష్యులంతా మెల్లగా ఒక్కక్కరు దర్శకులుగా పరిచయం అవుతున్నారు. ఒక్కో డైరెక్టర్ నుండి ఒకరు.. ఇద్దరు.. ముగ్గురు ఇలా వస్తూనే ఉన్నారు. కానీ ఒక స్టార్ డైరెక్టర్ నుండి మాత్రం ఆయన అసిస్టెంట్ డైరెక్టర్లు ఎవరు కూడా డైరెక్టర్ అయి సినిమాలు తీయడం లేదు. స్టార్ డైరెక్టర్లు వారి అసిస్టెంట్ లను బయట నిర్మాతలకు పరిచయం చేస్తున్నారు. ఏ నిర్మాత ముందుకు రాకపోతే వీళ్ళే నిర్మాతలుగా మారి కొత్త దర్శకులకు లైఫ్ ఇస్తున్నారు. ఒకవేళ అసిస్టెంట్స్ దర్శకులుగా ఫెయిల్ అయితే మళ్లీ అసిస్టెంట్ డైరెక్టర్లుగా తమ వద్ద ఉపాధి కల్పిస్తున్నారు. ఇండస్ట్రీలో చాలామంది డైరెక్టర్స్ అలా అసిస్టెంట్ లకు.. నూతన కథలు రాసుకొని సిద్ధంగా ఉన్న వారికి ఓ దారి చూపిస్తున్నారు. మరి ఒక రైటర్ గా సినీ ప్రస్థానం మొదలు పెట్టి ప్రస్తుతం ప్రముఖ డైరెక్టరుగా మారిన ఆయన నుండి మాత్రం ఇంతవరకు ఏ ఒక్క అసిస్టెంట్ డైరెక్టర్ కూడా సినిమా డైరెక్టర్ అయినట్లు పెద్దగా దాఖలాలు లేవు.

మరో విషయం ఏంటంటే.. ఒక అసిస్టెంట్ డైరెక్టర్ ఫిల్మ్ డైరెక్ట్ చేయబోతున్నాడు అంటే.. స్టార్ డైరెక్టర్స్ దగ్గరుండి మరి ప్రోత్సహిస్తారు. అలాగే వారి ఆడియో లాంచ్, ప్రీ రిలీజ్ వేడుకలలో గొప్పగా పరిచయం చేస్తున్నారు. మరి ఆ స్టార్ డైరెక్టర్ ఎప్పుడు కూడా ఆయన నుండి అసిస్టెంట్ డైరెక్టర్లను కూడా పరిచయం చేయలేదు. ఎందుకో తెలియదు. ఉదాహరణకు డైరెక్టర్ సుకుమార్ ఉన్నారు. ఆయన నుండి దాదాపు పలువురు కొత్త దర్శకులు ఇండస్ట్రీకి పరిచయం అవ్వబోతున్నారు. అలాగే రాజమౌళి అసిస్టెంట్స్.. వివి వినాయక్.. కొరటాల శివ.. అందరూ వాళ్ల అసిస్టెంట్ లకు లైఫ్ ఇస్తున్నారు. ఆఖరికి అర్జున్ రెడ్డి అసిస్టెంట్ కూడా తమిళంలో డైరెక్టర్ గా లాంచ్ అయ్యాడు. మరి ఆ స్టార్ డైరెక్టర్ నుండి ఎందుకు కొత్త దర్శకులు బయటికి రాట్లేరు. వాళ్ల టాలెంట్ గుర్తించట్లేదా.. లేక ఆయన దగ్గరే పర్మినెంట్ అసిస్టెంట్స్ వరకే వాళ్ల కెరీర్ ఆపేద్దాం అనుకుంటున్నారా..? అని సినీవిశ్లేషకులు అభిప్రాయ పడుతున్నారు. చూడాలి మరి త్వరలో ఎవరినైనా కొత్త దర్శకుడిగా పరిచయం చేస్తారేమో..!!