Begin typing your search above and press return to search.

సొంత భాషలో సినిమాకి సిద్దమైంది

By:  Tupaki Desk   |   7 April 2017 6:16 PM GMT
సొంత భాషలో సినిమాకి సిద్దమైంది
X
ఒకే ఒక్క సినిమాతో స్టార్ ఇమేజ్ అందుకోవడం అందరికీ దక్కే అదృష్టం కాదు. ఇందుకు అంతలేసి ట్యాలెంట్ కూడా ఉండాలి కానీ.. చాలాసార్లు ప్రతిభ ఒక్కటే క్రేజ్ తీసుకు వచ్చేయదు. మలయాళ ప్రేమమ్ లో నటించిన సాయిపల్లవికి అన్నీ కలిసొచ్చాయి.. సింగిల్ మూవీతో స్టార్ రేంజ్ పొందేసింది. . ప్రేమమ్ తర్వాత సౌత్ లోని అన్ని భాషల నుంచి ఈ భామకు అవకాశాలు వెల్లువెత్తాయి.

మల్లూవుడ్ లో మంచి స్థాయి అందుకున్న సాయి పల్లవి.. నిజానికి తమిళమ్మాయి. అయినా సరే ఇప్పటివరకూ ఒక్క తమిళ్ మూవీలో కూడా నటించకపోవడం ఆశ్చర్యకరం. విక్రమ్ - విజయ్ చందర్ ల మూవీలోను.. అలాగే మణిరత్నం రూపొందించిన కాట్రు వెలియిదాయ్(చెలియా)లోను మొదట ఈమెనే తీసుకున్నారు. కానీ ఆ ప్రాజెక్టుల నుంచి సాయి పల్లవి వైదొలగింది. మళ్లీ ఇప్పుడు ఓ తమిళ సినిమాకి ఓకే చెప్పి.. తన సొంత భాషలో తొలి మూవీకి రెడీ అయింది ఈ భామ.

అమలా పాల్ భర్త(మాజీ) ఏఎల్ విజయ్ దర్శకత్వంలో ఓ సినిమాకి సాయి పల్లవి సైన్ చేయడం విశేషం. త్వరలో ఈ సినిమాపై అధికారిక ప్రకటన వెలువడనుంది. మరోవైపు తెలుగులో వరుణ్ తేజ్ హీరోగా శేఖర్ కమ్ముల దర్శకత్వంలో రూపొందుతున్న ఫిదా చిత్రంలో నటిస్తోంది సాయి పల్లవి.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/