Begin typing your search above and press return to search.

ఆ విషయంలో వాళ్లు ఎందుకు సైలెంటుగా ఉంటున్నారు..?

By:  Tupaki Desk   |   1 April 2020 11:30 PM GMT
ఆ విషయంలో వాళ్లు ఎందుకు సైలెంటుగా ఉంటున్నారు..?
X
ప్రపంచ వ్యాప్తంగా కరోనా విజృంభిస్తున్న నేపథ్యంలో దేశ వ్యాప్తంగా లాక్ డౌన్ చేసిన విషయం తెలిసిందే. అయితే దీని వలన ప్రజలందరూ ఎటువంటి పనులు లేక ఇంటికే పూర్తిగా పరిమితం కావాల్సి వచ్చింది. దానితో ఇల్లు గడిచే పరిస్థితి లేక పేద, దిగువ మధ్యతరగతి కుటుంబాల వారు తీవ్ర సమస్యలు ఎదుర్కొంటున్నారు. కరోనా వైరస్ బాధితుల సహాయార్థం తెలుగు సినిమా ఇండస్ట్రీ నుంచి ఒక్కొక్కరుగా భారీ విరాళాలు అందిస్తున్నారు. తెలుగు రాష్ట్రాల్లో ఎలాంటి విపత్తు వచ్చినా టాలీవుడ్ చిత్ర పరిశ్రమ సహాయం చేయడానికి ఎప్పుడూ ముందుంటుంది. హీరోలు దర్శక నిర్మాతలు తమ వంతుగా కష్టాల్లో ఉన్నవారిని ఆదుకునేందుకు తమ వంతు సాయం చేస్తున్నారు.

మెగాస్టార్ చిరంజీవి, అక్కినేని నాగార్జున, వెంకటేష్, సూపర్ స్టార్ మహేష్ బాబు, ప్రభాస్, ఎన్టీఆర్, పవన్ కళ్యాణ్, రామ్ చరణ్, నాగచైతన్య, నితిన్, మంచు మనోజ్, రాజశేఖర్, అల్లరి నరేష్, నాని, దర్శకులు త్రివిక్రమ్ శ్రీనివాస్, కొరటాల శివ, వి.వి.వినాయక్, అనిల్ రావిపూడి, కొరటాల, సుకుమార్ వంటి వారు ముందుకు వచ్చి తమ వంతుగా విరాళాలు అందించి వారి బాధ్యతను నెరవేర్చారు. దీంతో ఇండస్ట్రీలో దాదాపు అందరూ తమకు తోచిన సహాయం చేసారు. కానీ కొంతమంది నటులు మాత్రం ముందుకు రాలేదు. వారిలో బాలయ్య, బ్రహ్మానందం, విజయ దేవరకొండ లాంటి వారు మాత్రం సైలెంట్ గా ఉంటున్నారని ఫ్యాన్స్ నిరాశకు గురవుతున్నారట.

ఈ విషయాన్ని వారి అభిమానులు సోషల్ మీడియా ద్వారా తెలియజేస్తున్నారు. సోషల్ మీడియాలో ఎప్పుడూ యాక్టీవ్ గా ఉండే విజయ్ దేవరకొండ కూడా సైలెంట్ గా ఉండటం విజయ్ ఫ్యాన్స్ కి నచ్చడం లేదంట. టాలీవుడ్ లో మంచి పొజిషన్ లో ఉన్న నటులు స్పందించకపోవడం ఏంటని అందరికీ వస్తున్న డౌట్. కానీ కొందరు విరాళాలు ప్రకటించినప్పటికీ దాన్ని పబ్లిసిటీ చేసుకోవడం ఇష్టం లేకనో, ఇంకేదైనా కారణం చేతనో వాళ్ళు బయటకి చెప్పరు, అంత మాత్రానా వాళ్ళని ట్రోల్ చేయడం కరెక్ట్ కాదని మరికొందరు తమ అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు. కానీ సోషల్ రెస్పాన్సిబిలిటీ తో ముందుకు వచ్చిన వాళ్ళని తప్పకుండా అభినందించాలి.